విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో ఇంగ్లీష్ చిచ్చు..! తెలుగులో మొదలైన నేతల యుద్దం..! ఫైర్ అవ్వనున్న పవన్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకూ ఇసుక కొరత మీత అట్టుడికిన అమరావతి ఒక్క సారిగా మలుపు తీసుకుంది. అందుకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెర తీసారు. రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేస్తే పరవాలేదుగానీ వ్యక్తిగత ఆరోపణలు చేసి కొత్త వివాదానికి శ్రీకాంరం చుట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మనసు గాయపడేలా? ఇలాగేనా?: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలుమనసు గాయపడేలా? ఇలాగేనా?: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ కౌంటర్..

జగన్ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ కౌంటర్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల పట్ల జనసైనికులు ఎవ్వరూ ఆవేశానికి లోనుకావద్దని, సంయమనంగా ఉంగాలని పిలుపునివ్వడంతో సమస్య ఎంత తీవ్రంగా పరిణమించిందో తెలుస్తోంది. ఇదే అమరావతిలో మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఏపి సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు రాబోతున్నారు. పవన్ పై వ్యక్దిగత వ్యాఖ్యలు చేసిన జగన్ పట్ల కూడా గబ్బర్ సింగ్ వ్యక్తిగతంగానే స్పందిస్తారా అనే అంశం అమరావతి వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశం పట్ల ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ స్పందించాల్సి ఉంది.

జనసైనికులు సంయమనం పాటించాలి.. సీఎం కు సమాధానం తానే ఇస్తానన్న జనసేనాని..

జనసైనికులు సంయమనం పాటించాలి.. సీఎం కు సమాధానం తానే ఇస్తానన్న జనసేనాని..

నవంబర్ 11వ తారీఖున జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఏపి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా ఏపి ప్రభుత్వం ప్రాథమిక విద్యనుంచే సంస్కరణలు తీసుకురావలని భావించింది. అందుకోసం ఓ జీవోను కూడా విడుదల చేసింది. అసలు వివాదం రగలడానికి ఇదే కారణంగా మారింది. గతంలో తెలుగు బాష కళ్ల లాంటిది., ఇంగ్లీష్ భాష కళ్లద్దాల వంటిదని చెప్పిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని, తెలుగు భాషకు సముచిత స్ధానం కల్పించాని గతంలో పలుసార్లు ప్రయత్నించిన చంద్రబాబు నాయుడును, తెలుగు భాషను పరిరక్షించుకోవాలని పేర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏక కాలంలో టార్గెట్ చేసారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వ్యక్తి గత విమర్శలెందుకు..? మండిపడుతున్న జనసైనికులు..

వ్యక్తి గత విమర్శలెందుకు..? మండిపడుతున్న జనసైనికులు..

విద్యారంగంలో పేదలు కూడా రాణించాలంటే ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యం అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ భాష సరిగా నేర్చుకోకపోతే నేటి యువత ప్రపంచంతో పోటీ పడలేరని అభివర్ణించారు. అందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజుల క్రితం ఇంగ్లీష్ బోధన గురించి జీఓ జారీ చేసామని సీఎం స్పష్టం చేసారు. అసలు వివాదం ఇక్కడే మొదలైనట్టు తెలుస్తోంది. జీవో జారీ అయిన వెంటనే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారు విడ్డూరంగా స్పందిస్తున్నారని వైయస్ జగన్ ఎద్దేవా చేసారు. అదే క్రమంలో రెండు వార్తా పత్రికలను సైతం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ముగ్గురిని టార్గెట్ చేసిన జగన్.. బాబు, వెంకయ్య, పవన్ లను తీవ్రంగా విమర్శించిన సీఎం..

ముగ్గురిని టార్గెట్ చేసిన జగన్.. బాబు, వెంకయ్య, పవన్ లను తీవ్రంగా విమర్శించిన సీఎం..

అంతే కాకుండా సినిమా హీరో పవన్ కళ్యాణ్ కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో, ఎంత మంది పిల్లలు ఉన్నారో మరి, వాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా అని ఏపీ సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారని నిలదీసారు. వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలను సంయమనంగా ఉండాలని చెప్తూనే, ఇసుక కొరతపై జనసేన చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అన్నీ అంశాలకు మంగళవారం సాయంత్రం కాటమరాయుడు నుండి కౌంటర్ వెలువడనుంది.

English summary
Pawan Kalyan seems to be seriously considering Jagan's comments. While saying that the party workers should be in the forefront, CM Jagan was trying to sideface Janasana's fight against the scarcity of sand. All items will be countered from Pavan Kalyan on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X