• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జనసేన ముందుకు రావడం భేష్..! యురేనియంపై పవన్ స్పందనకు అందుతున్న ప్రశంసలు..!!

|
  Pawan Kalyan : Stop Uranium Mining In Nallamala Forest || యురేనియం తవ్వకాలపై పవన్ స్పందనకు ప్రశంసలు

  హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాలపై తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. రాజకీయ నేతలు కూడా పవన్ కళ్యాణ్ చొరవను అభినందిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతికి సంభవించే విపత్తుపట్ల ముందస్తుగా అంచనావేసి, అలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వాలకు చెప్పుకొస్తూనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం ప్రశంసనీయమని పలు రాజకీయనేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రకృతికి సంభవించే విపత్తు, తవ్వకాల వల్ల ప్రభలే వ్యాదులపట్ల సామాన్య ప్రజల్లో అవగాహన పెంపొందించడం పవన్ కళ్యాణ్ చిత్తశుద్దికి నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.

  జనసేన తొలి పోరాటం..! యురేనియం తవ్వకాలకు వ్యతికంగా పవన్ శ్రీకారం..!!

  జనసేన తొలి పోరాటం..! యురేనియం తవ్వకాలకు వ్యతికంగా పవన్ శ్రీకారం..!!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ పార్టీల్లో సానుకూల దృక్పధం వ్యక్తం అవుతోంది. యురేనియం తవ్వకాలతో కలిగే సమస్యపట్ల జనసేన స్పందించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యురేనియం తవ్వకాలతో సమాజానికి పొంచిఉన్న ప్రమాదం పట్ల పవన్ కళ్యాణ్ ముందుస్తు చైతన్య పరిచే కార్యక్రమాల పట్ల పలు పార్టీలకు చెందిన నేతలు మెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాలకతీతంగా, పార్టీలకతీతంగా జనసేన పార్టీ ముందుకు రావడం ఆదర్శనీయంగా ఉందని అంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న నేతలు, విద్యావేత్తలు. పర్యావరణ పరిరక్షకులు, ప్రకృతి ఆరాధకులు పవన్ కళ్యాణ్ చొరవను అభినందిస్తున్నారు.

  తవ్వకాలు జరపొద్దు..! ప్రకృతిని కాపాడాలంటున్న జనసేనాని..!!

  తవ్వకాలు జరపొద్దు..! ప్రకృతిని కాపాడాలంటున్న జనసేనాని..!!

  సమాజానికి ప్రమాదంగా పరిణమించే ప్రభుత్వ కార్యక్రమాలపట్ల అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల ప్రభుత్వాలకు ఆర్థిక లాభాలు వచ్చినా అది ప్రకృతికి ఎంతో ప్రమాదమని జనసేనాని విశ్లేషిస్తున్నారు. ప్రకృతిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవనం ప్రశ్నార్థకం అవ్వడంతో పాటు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని గబ్బర్ సింగ్ స్పష్టం చేస్తున్నారు. అడవులనే నమ్ముకుని, అడవిలోనే జీవనాన్ని కొనసాగిస్తున్న గిరిపుత్రులకు ఎలాంటి ప్రత్యామ్నయం లేదని, వారు తరతరాలుగా అడవుల్లోనే జీవిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు.

  అనుమతులను ఉపసంహరించుకోవాలి..! లేకపోతే ఉద్యమం తప్పదంటున్న గబ్బర్ సింగ్..!!

  అనుమతులను ఉపసంహరించుకోవాలి..! లేకపోతే ఉద్యమం తప్పదంటున్న గబ్బర్ సింగ్..!!

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రకృతిని బలిపశువుగా వాడుకుంటున్నారని, దీని వెనక ఉన్న ప్రమాదరక అంశాలను మరుగున పెట్టేందుకుకూడా వెనకాడడం లేదని పవన్ మండిపడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టి ప్రభుత్వాలు లాభపడాలనుకుంటే కుదరనివ్వమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని రాజకీయాలకోసం వినియోగించుకోవాలనుకోవడం అత్యంత హేయమైన చర్యగా కాటమరాయుడు అభివర్ణిన్నారు. గతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు మంజూరి చేసి, ఇప్పుడెందుకు మాటమారుస్తున్నారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పవన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

  రాజకీయ వర్గాల నుండి పవన్ కు ప్రశంసలు..! జనసైనికుడి చొరవకు అభినందనల వెల్లువ..!!

  రాజకీయ వర్గాల నుండి పవన్ కు ప్రశంసలు..! జనసైనికుడి చొరవకు అభినందనల వెల్లువ..!!

  ఆంద్ర ప్రదేశ్ లో బాక్పైట్ తవ్వకాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబందించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు సమాజానికి చాలా ప్రమాదకరమని ఎన్నో పరిశోధనలు దృవీకరించాయని పవన్ విశ్లేషిస్తున్నారు. ఈ సందర్బంగా 80సంవత్సరాల క్రితం నల్లమల యురేనియం తవ్వకాల పట్ల జరిగిన పరిణామాలను ఆయన గుర్తుచేసారు. 1938 నాటి పుస్తకం గురించి పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వనవాసి అనే అనువాద పుస్తకం గురించి పవన్ స్పందించారు. వనవాసి అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని తన ట్వీట్ లో వెల్లడించారు. ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశంపై తీవ్రంగా స్పందిస్తున్న జనసేనాని తాజాగా ఈ పుస్తకం గురించి ప్రస్తావించడాన్ని కూడా పలు రాజకీయ నేతలు ప్రశసిస్తున్నారు.

  English summary
  Janasana supremo Pawan Kalyan has been getting positive response from all sections of the decision on uranium mining. Political leaders are also delighted with Pawan Kalyan's initiative. Many politicians believe that the uranium excavation is a prerequisite for the progress of the nature of the disaster.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X