• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

2019 ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం, అభ్యర్థుల విషయంలో చంద్రబాబు-జగన్ కంటే ముందే

|

అమరావతి: విజయవాడ కేంద్రంగా 2019 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం చెప్పారు. ఆయన విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేత రావెల కిషోర్ బాబు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొదట ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

<strong>ఆళ్లగడ్డలో అఖిలప్రియకు కీలక నేత షాక్, ఎవ్వర్నీ వదిలిపెట్టనని వైసీపీకి తీవ్ర హెచ్చరిక</strong>ఆళ్లగడ్డలో అఖిలప్రియకు కీలక నేత షాక్, ఎవ్వర్నీ వదిలిపెట్టనని వైసీపీకి తీవ్ర హెచ్చరిక

జనసేన సైనికులు ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని సూచించారు. అవినీతిరహిత పాలన కోసం అందరు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఎప్పుడూ పని చేస్తుందని తెలిపారు.

ఈ రోజు నుంచే పవన్ కళ్యాణ్ శ్రీకారం

ఈ రోజు నుంచే పవన్ కళ్యాణ్ శ్రీకారం

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అందరం కష్టపడి జనసేనను గెలిపిద్దామని చెప్పారు. వచ్చే ఎన్నికలకు ఈ రోజు నుంచే, విజయవాడ నుంచి శ్రీకారం చుడుతున్నానని చెప్పారు. ఏపీ బంగారు భవిష్యత్తులో జనసేన కీలక పాత్ర పోషించాలన్నారు.

 గత అనుభవాలను ప్రేరణగా తీసుకుందాం

గత అనుభవాలను ప్రేరణగా తీసుకుందాం

2019 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా ఓ సందేశం ఇచ్చారు. గత ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకుని నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దామని, ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడే రాజై వెలగాలని, మానవీయ పాలనకు నవ చరిత్రకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

 జనసేన 100 రోజుల ప్లాన్

జనసేన 100 రోజుల ప్లాన్

కాగా, 2019 ఎన్నికలపై జనసేనాని దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన సినిమాలను కూడా ఆపేశారు. ఇటీవల యూరప్ వెళ్లిన పవన్ ఇప్పుడు తిరిగి వచ్చారు. జనవరి 1వ తేదీ నుంచి అమరావతిలోనే ఉంటూ ఎన్నికలకు సిద్ధం కానున్నారు. రాబోయే వంద రోజులకు సంబంధించి పార్టీ కార్యక్రమాలపై ఓ ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ప్రణాళికతో ఎన్నికల వరకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లవచ్చునని భావిస్తున్నారు.

మిగిలిన జిల్లాల్లోను త్వరలో ముగించాలనే యోచన

మిగిలిన జిల్లాల్లోను త్వరలో ముగించాలనే యోచన

పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పోరాట యాత్ర పేరుతో పలు జిల్లాల్లో పర్యటించారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటన చేశారు. మరో ఏడు జిల్లాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరగా పూర్తి చేయనున్నారు. ఆయా జిల్లాల్లో కొన్ని ప్రధాన అంశాలను ఎంచుకొని జనసేన కవాతులు చేయనున్నారు.

జగన్, చంద్రబాబుల కంటే ముందే అభ్యర్థుల ప్రకటన!

జగన్, చంద్రబాబుల కంటే ముందే అభ్యర్థుల ప్రకటన!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని అసెంబ్లీ, లోకసభ స్థానాలలో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాజాగా, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా తెలిపారు. మిగతా పార్టీల కంటే ముందే ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. కొద్ది రోజుల్లో అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన పార్టీ నేతలు చెప్పారు. అలాగే, ఏ పార్టీతోను పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan reached Andhra Pradesh capital Amaravati and begins 2019 elections campaign on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X