విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా ప్రజల కమిట్మెంట్ ఆంధ్రా ప్రజలకు ఉంటే అది సాధ్యం .. ప్రత్యేక హోదాపై పవన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ | Pawan Kalyan Reaction On Nirmala Sitharaman Comments

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న వేళ పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి. అందరినీ అలోచింపజేస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధించాలంటే ఇది కాదు పద్ధతి అని ఆయన చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.

పార్టీలో చేరకముందే భవిష్యత్ సీఎం నేనే అన్న కోమటి రెడ్డి ... కలకలంగా మారిన ఆడియో పార్టీలో చేరకముందే భవిష్యత్ సీఎం నేనే అన్న కోమటి రెడ్డి ... కలకలంగా మారిన ఆడియో

ఏపీలో మరోమారు తెరపైకి ప్రత్యేక హోదా అంశం ... కేంద్రం నిర్ణయం .. పవన్ వ్యాఖ్యలు

ఏపీలో మరోమారు తెరపైకి ప్రత్యేక హోదా అంశం ... కేంద్రం నిర్ణయం .. పవన్ వ్యాఖ్యలు

ఒకపక్క కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ పదేపదే తేల్చి చెప్తుంది. తాజాగా నిర్మలా సీతారామన్ సైతం ప్రత్యేక హోదా అంశం కేంద్రం పరిశీలనో లేదని పేర్కొనటం ఏపీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక జగన్ ప్రత్యేక హోదా సాధన అజెండాతో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్రం నుండి ఈ తరహా సంకేతాలు రావటం అటు అధికార పార్టీకి సైతం షాకింగ్ అనే చెప్పాలి .
ఇక ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచించేలా ఉన్నాయి. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల,ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు పోరాడితే, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజలు ఆకాంక్ష ఉన్నప్పటికీ పోరాటపటిమ చూపలేకపోయారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .

ప్రజల నుండి బలమైన నిరసన రానంత కాలం ఎవరేం చెయ్యలేరన్న పవన్ కళ్యాణ్

ప్రజల నుండి బలమైన నిరసన రానంత కాలం ఎవరేం చెయ్యలేరన్న పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ తెలిపారు . ఇక రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా సాధన పేరు చెప్పి చేసే ప్రయత్నం కంటే ప్రజల నుండి బలమైన నిరసన వచ్చినప్పుడు వచ్చే ఫలితం వేరేగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రజల నుండి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ఆంధ్ర ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా పోరాటం ఒక్క రాజకీయ పార్టీలకే కాదు ప్రజలకు సైతం అవసరం అని ప్రజల భాగస్వామ్యంతో పోరాటం చేస్తే సాధించవచ్చని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయంగా పేర్కొన్నారు.

తెలంగాణా ఉద్యమం తరహాలో ఉద్యమిస్తే సాధ్యం అన్న పవన్ .. పవన్ ఆలోచనకు ప్రజా నిర్ణయం ఏంటో

తెలంగాణా ఉద్యమం తరహాలో ఉద్యమిస్తే సాధ్యం అన్న పవన్ .. పవన్ ఆలోచనకు ప్రజా నిర్ణయం ఏంటో

ప్రత్యేక హోదా బతిమాలితే వచ్చేది కాదని తెలంగాణా ఉద్యమ తరహాలో అందరం కలిసి సమిష్టిగా పోరాడితే వస్తుందని తన మాటగా చెప్పారు పవన్ . ఇక కేంద్రం ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన నేపధ్యంలో జనసేనాని మాటలు ఏపీ ప్రజల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి . ప్రస్తుత పరిస్థితుల్లో హోదాపై దైర్యంగా మాట్లాడే సత్తా అటు ఎపీలోని అధికార పార్టీకి లేదు. ఎందుకంటె కేంద్రంతో సత్సంబంధాలు దెబ్బ తింటే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. ఇక టీడీపీ వల్ల కాదు. అసలే ఎన్నికల్లో ఓటమితోనే కాకుండా వలసలతో బాగా నష్టపోయిన పార్టీ పెద్ద ఎత్తున కేంద్రం పై ఒత్తిడి తేలేదు . అధికారంలో ఉన్నప్పుడే అది సాధ్యం కాలేదు. ఇప్పుడు టీడీపీ తో సాధ్యం కాదు అనే భావన ఉంది. ఇక పోరాటపటిమ ఉన్న నాయకుడు , ఎవరితోనైనా నిర్భయంగా పోరాడగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజలు కలిసి ముందుకు సాగితే పోరాటం చేస్తానన్న సంకేతాలు పవన్ తన మాటల ద్వారా ఇచ్చాడు. మరి ఏపీ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో.

English summary
The center repeatedly affirms that the center is not given special status. Recently, Nirmala Sitharaman has also expressed concern that the status of the special status center has not been examined. Shortly after the Jagan government came to power with a special status agenda, such signs were coming from the center, which should be shocking to the ruling party.Pawan's comments at the same time make everyone think.Pawan Kalyan commented that the Andhra people did not have the aspirations and expectations of the Telangana people. Pawan Kalyan claimed that the Telangana people fought for a separate Telangana state for decades, the Andhra people could not fight back despite the aspirations of the special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X