విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చెయ్యాలన్న పవన్ .. జగన్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టేగా

|
Google Oneindia TeluguNews

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. అక్రమ నిర్మాణాల తొలగింపుపై జనసేనాని తనదైన శైలిలో స్పందించారు. అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చేయ్యాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావేదికతోనే సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని పవన్ డిమాండ్ చేశారు.

రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత

ఇక ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించేలా పని చెయ్యాలని ఆయన పేర్కొన్నారు . అనుమతిలేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నీ కూల్చినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. పర్మిషన్ లేకుండా ఇళ్లు నిర్మించిన వారిపై కూడా చర్యలు తీసుకొంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు సరైనవేనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . పర్మిషన్ లేకుండా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.

 Pawan said to dismantle the illegal structure wherever it was..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక ఈ చర్య ప్రతిపక్ష టీడీపీపై కక్ష సాధింపు చర్యేనంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరికాదని మండిపడుతుంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజావేదిక కూల్చివేత సక్రమమే అని స్పందించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆయన కూడా ఏకీభవించారు.

English summary
Pawan Kalyan came in support of the decision taken by YS Jaganmohan Reddy over Praja Vedika demolition . He made it clear, Praja Vedika is an illegal construction, I extend my support to the decision of demolishing it. At the same time, All the illegal constructions on the banks of Krishna and aslo in the state has to be demolished. Only then, People will have faith in government pawan stated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X