విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ మాట విని జగన్ ఏపీకి అన్యాయం చేస్తారా ? పోలవరం ఎత్తు తగ్గిస్తే ఊరుకోం : దేవినేని ఉమా ఫైర్

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం విషయంలో టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా లక్షమంది భూనిర్వాసితుల త్యాగాలను అవహేళన చేసేలా ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటానికి సిద్ధపడ్డారని ఆయన మండిపడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు తగ్గించాలంటే, అందుకు తగ్గట్టే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

వైఎస్ జగన్ చేతిలో రాష్ట్ర పాలన..పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న చంద్రబాబువైఎస్ జగన్ చేతిలో రాష్ట్ర పాలన..పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న చంద్రబాబు

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక

పోలవరం ఎత్తు తగ్గిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు దేవినేని ఉమా. రాష్ట్రానికి జగన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరం ఎత్తు తగ్గిస్తారు అని చెప్పారు. నాడు సీఎం కేసీఆర్ చెప్పిన మాటలనే నేడు ఏపీ సీఎం జగన్ అవలంబిస్తున్నారని మండిపడ్డారు దేవినేని ఉమా . పోలవరం ప్రాజెక్టు ఎత్తు 3.57 మీటర్లు తగ్గించటానికి సిద్ధపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ లోని కరువు జిల్లాలకు నష్టం

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ లోని కరువు జిల్లాలకు నష్టం

పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలి. నిర్వాసితులకు 27 వేల కోట్ల వరకూ చెల్లింపులు చేయాలి . అవన్నీ వదిలిపెట్టి ప్రాజెక్టు ఎత్తున 135 అడుగుల కే పరిమితం చేస్తామని తూతూమంత్రంగా మూడు వేల కోట్లు ఖర్చు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తును తగ్గిస్తే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర, రాయలసీమ లోని కరువు ప్రభావిత ప్రాంతాల వరకు చేరే అవకాశం మూసుకుపోతుంది అంటూ పోలవరం కథ సమాప్తమవుతుంది అంటూ పేర్కొన్నారు దేవినేని ఉమా.

లేఖ రాసి చేతులు దులుపుకుంటారా ? ఎంపీలు ఏం చేస్తున్నారు

లేఖ రాసి చేతులు దులుపుకుంటారా ? ఎంపీలు ఏం చేస్తున్నారు

జగన్ పోలవరం పై కేంద్రానికి ఉత్తరాలు రాసేసి చేతులు దులిపేసుకున్నారు అని దేవినేని ఉమా ప్రధానిని కలిసిన ప్రతిసారీ ప్రాజెక్టు నిధుల గురించి ఎందుకు చర్చించలేదు అంటూ ప్రశ్నించారు. 57548 కోట్ల కు కేంద్రం నుంచి అనుమతి పొందామని ఇప్పుడు నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తామని కేంద్రం అంటే వైసీపీకి చెందిన ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కోట్ల రూపాయలు మెక్కుతూ నిర్వాసితులకు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ఉత్తర కుమార మంత్రి ఎందుకు నోరు తెరవట్లేదో ?

ఉత్తర కుమార మంత్రి ఎందుకు నోరు తెరవట్లేదో ?


2020నాటికి పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ఇల్లు ఇస్తామని చెప్పిన ఉత్తర కుమార మంత్రి ఎందుకు నోరు తెరవట్లేదో అంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఉద్దేశించి మాట్లాడారు దేవినేని ఉమా. పోలవరం పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చెబుతున్నారు. సీఎం జగన్, నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన షెడ్యూళ్ళు అయిపోయాయి. అయితే ఇప్పుడు విజయసాయి వంతు వచ్చింది అంటూ దేవినేని ఉమ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

Recommended Video

#BabriMasjidVerdict:Babri Masjid కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న Plan కాదు! - Lucknow CBI Court
 పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్ల తెలంగాణాకు నష్టం .. కేసీఆర్ అభ్యంతరం తోనే ఎత్తు తగ్గింపు

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్ల తెలంగాణాకు నష్టం .. కేసీఆర్ అభ్యంతరం తోనే ఎత్తు తగ్గింపు

తెలంగాణ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాద్రి జిల్లాలోని 100 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రానికి లేఖ రాసింది. 2013 - 2014 అంచనాల మేరకు 36 లక్షల క్యూసెక్కుల బ్యాక్ వాటర్ ఉంటే సుమారు 72 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదముందన్న తెలంగాణ, పోలవరం నీటి నిలువ 50 లక్షల క్యూసెక్కుల పెంచడంతో వందకు పైగా గ్రామాలు మునిగిపోతాయని పేర్కొంది. అంతే కాదు పలు కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కూడా మునిగిపోతాయని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేంద్రానికి లేఖ రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపధ్యంలోనే పోలవరం ఎత్తు తగ్గించే పని జగన్ మొదలుపెట్టారంటూ మాజీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు .

English summary
Devineni Uma warned that if the height of Polavaram is reduced, the Telugu Desam Party will struggles with people across the state. He was incensed that Jagan Reddy was doing a grave injustice to the state. Telangana State Chief Minister KCR said in the Telangana Assembly on September 15 last year that Polavaram height would be reduced. Devineni Uma was incensed that today AP CM Jagan is following the words spoken by CM KCR. Polavaram was outraged that the project was prepared to reduce the height to 3.57 meters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X