విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పై తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు !! .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొనసాగుతున్న రాజధాని రగడ నేపధ్యంలో రైతులకు మద్దతుగా రాజధాని పర్యటన చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసులకు పవన్ కు మధ్య జరిగిన వాగ్వివాదంలో ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తుళ్ళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చెయ్యటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ పై కేసు నమోదు చేయనున్న తుళ్లూరు పోలీసులు రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని కూడా బ్రేక్ చేసినందుకు పవన్‌‌‌పై పోలీసులు కేసు పెట్టాలని రంగం సిద్ధం చేస్తున్నారు.

న్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగంన్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం

మంగళవారం అమరావతిలో పర్యటన సందర్భంగా.. పవన్ మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి ఆయన్ని అనుమతించలేదు పోలీసులు. అదే రోజు జగన్ సచివాలయానికి వెళ్ళిన నేపధ్యంలో సచివాలయంలో జగన్ ఉన్నారని అనుమతించలేదు . పవన్‌తో పాటు ఆయన కాన్వాయ్‌‌ను అడ్డుకున్నారు. మందడం వెళ్లే దారిలో కృష్ణయపాలెం నుంచి మందడం మీదుగా వెళ్తున్న పవన్‌ను పోలీసులు వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద నిలిపివేశారు. వెంకటయపాలెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పెట్టిన కంచెను దాటినట్లు ఆయనపై పోలీసులు ఆరోపిస్తున్నారు . పవన్ కళ్యాణ్ పోలీసులపై తన కోపాన్ని వ్యక్తం చేసిన విధానాన్ని పోలీసులు కూడా తప్పుపట్టారు.

Police ready to file case against Pawan kalyan .. the reason is

సచివాలయంలో సీఎం ఉన్నందున సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. లేకుంటే నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. దీంతో పవన్ అక్కడే నేలపైన కూర్చొని పోలీసుల తీరుకు నిరసన తెలిపారు .అక్కడే రోడ్డుపైనే పవన్ ధర్నా నిర్వహించారు. సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. మరోవైపు మందడం గ్రామాల ప్రజలు మాత్రం పవన్ తన గ్రామంలో రావాలని కోరినా పోలీసులు ఆయనను వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాలినడకన పవన్ మందడం వెళ్ళారు. ఈ నేపధ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది .

English summary
Pawan Kalyan made a tour for the support of capital farmers. Tulluru police are to file a case against him for allegedly interfering with police duties during a clash between police and Pawan. The Tulluru police is preparing to file a case against Pawan for not only interrupting police duties on the capital visit but also breaking Section 144 and 30 Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X