విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్‌ 70, చంద్రబాబు 25 ఏళ్ల వయస్సు వారిలా ...! అసెంబ్లీలో అంబటి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రైతుల సమస్యలతో పాటు ఉల్లిధరల పెరుగుదల, ఇతర అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు లేవనెత్తిన అంశాలపై ఎమ్మ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు నాయుడు అబద్దాలను నిజం చేయడంలో దిట్ట అంటూ ఫైర్ అయ్యారు. అబద్దాలను చెప్పడంలో ప్రతిపక్ష నేతలను మించిన వారు మరోకరు లేరు అంటూ.. ఆయన విమర్శించారు.

అసెంబ్లీలో ఉల్లి లొల్లితో హెరిటేజ్ పై సీఎం జగన్ వ్యాఖ్యలు .. స్పందించిన భువనేశ్వరిఅసెంబ్లీలో ఉల్లి లొల్లితో హెరిటేజ్ పై సీఎం జగన్ వ్యాఖ్యలు .. స్పందించిన భువనేశ్వరి

చర్చలో భాగంగా అంబటి రాంబాబు లోకేష్ ప్రస్తావన తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు 25 ఏళ్ల వయస్సున్నవాడిలా వ్యవహరిస్తుంటే.. , లోకేష్ 70 ఏళ్ల వయస్సున్న వారిలా వ్యవహరిస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు తన వయస్సుకు తగ్గట్టుగా మాట్లాడడం లేదని అన్నారు. 70 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు సభకు, ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాల్సి పోయి.. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు...

political war of words going on in ap assembly

అంతకంటే ముందు చంద్రబాబు మాట్లాడుతూ.. సభలో ఉన్న మొత్తం 150 ఎమ్మెల్యేలకు సమాధానం చెబుతానని చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది. కాగా చంద్రబాబు సైతం తీవ్రంగా స్పందించారు. లోకేష్, జగన్‌లపై ఆనాడే మాజీ సీఎం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికే సవాల్ విసిరారని, లోకేష్‌ను క్రమశిక్షణతో పెంచానని, కాని సీఎం జగన్ మాత్రం అమెరికా నుండి తిరుగు టపాలో వచ్చారని మరోసారి గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబంటితో పాటు రోజా సైతం తీవ్రంగా ఫైర్ అయ్యారు. జగన్ తిరుటుటపాలో వచ్చి నేడు చంద్రబాబును ఓడించి, ముఖ్యమంత్రి అయ్యారని అంబటి తెలిపారు.

కాగా ఇదే అంశంపై రోజా సైతం స్పందించారు. క్రమశిక్షణతో పెరిగిన లోకేష్‌కు మంగళగిరికి, మందళగిరి కి తేడా తెలియదని, ఇక కొడుకును గెలిపించుకోలేని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆమె ఫైర్ అయ్యారు. దీంతో మరోసారి జగన్ గురించి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రోజా హెచ్చరించారు

English summary
political war going on in ap assembly between ysrcp and tdp members. there was much discussion about farmers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X