తీపి కబురు.. పవర్ హాలీడే ఎత్తివేత.. 70 శాతం విద్యుత్ పెంచాం: మంత్రి పెద్దిరెడ్డి
వేసవిలో విద్యుత్ కోతలంటే ఇబ్బంది. రైతులకు నాణ్యమైన పవర్ కావాల్సిందే. అలాగే గృహలకు కూడా కంపల్సరీ.. పరిశ్రమలకు పవర్ లేకుంటే తప్పుదు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలీడే వినిపించేది. ఇప్పుడు అంతగా లేదు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. గృహాలకు కూడా కరెంట్ కోత తప్పలేదు. దీంతో జనం తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది.

186 మిలియన్ యూనిట్లే
ఇదివరకు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే.. ఇప్పుడు అదీ కాస్తా తగ్గింది. పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్ కూడా 70 శాతానికి పెంచుతూ డిసిసన్ తీసుకున్నామని తెలిపారు.

100 శాతం అనుమతి
ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజి, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర అవసరాల కోసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇంకా విద్యుత్ కొరత ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఆయన చెప్పారు. ఆరు నెలల్లోగా ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏడాదిలో 33 శాతం మేర విద్యుత్ ఆదా అయ్యిందని వివరించారు. ఆ మేరకు డిస్కమ్ తీసుకునే సబ్సిడీ తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ సబ్సిడీ 10 వేల కోట్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు.

తీపి కబురే
పరిశ్రమలకు మాత్రం ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో నిరంతరాయంగా పరిశ్రమలు నడిచే వీలు ఉంటుంది. పవర్ హాలీ డే వల్ల కంపెనీ నడవడం వల్ల వారికి మేలు జరగనుంది. ఇదివరకు వారానికి ఒకసారి పవర్ హాలీడే ఇచ్చినా.. ఇప్పుడు నిరంతరాయంగా పనిచేయనుంది. దీంతో పరిశ్రమలకు మరింత బూస్టింగ్ కలుగనుంది. పరిశ్రమలకు సంబంధించి మంత్రి ప్రకటన చేశారు.. కానీ, రైతుల కరెంట్, గృహలకు సంబంధించి ప్రకటన చేయలేదు. తెలంగాణలో అయితే రైతులకు పగటిపూట నాణ్యమైన పవర్ ఇస్తున్నారు.