• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రజావేదిక కూల్చేవేయడం అవివేకమంటున్న టీడిపి..! అదేం కాదంటున్న వైసీపి..!!

|

అమరావతి/హైదరాబాద్ : ప్రజావేదిక కూల్చివేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై టీడిపి నేతలు మండిపడుతున్నారు. యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు తో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప్రజావేదికను ఇప్పటికిప్పుడు తొలగిస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాల నష్టమన్నారు. 'ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని అన్నారు. ప్రజాధనంతో నిర్మించారు కాబట్టి, అది కూల్చేస్తే ఆ సొమ్ము వృథా అవుతుందని, రెండో విషయం ఏంటంటే, మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుంది అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

పిల్లలకు బండిస్తే పేరెంట్స్‌కు జైలు.. తాగి నడిపితే రూ.పదివేలు ఫైన్..

అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది..? బురద జల్లడం మానండంటున్న లోకేష్..!!

అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది..? బురద జల్లడం మానండంటున్న లోకేష్..!!

2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని సవరించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా సంఘం(టీఏసీ) ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పోలవరం విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేతల విమర్శలకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. "తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రూ.55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది?. అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైసీపీ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశలు చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు. ఇప్పటికైనా బీజేపీ, వైసీపీ నాయకులు.. టీడీపీ మీద బురదజల్లడం మాని, మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిది" అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

ప్రజావేదిక కూల్చివేత దారుణం..! కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం..!!

ప్రజావేదిక కూల్చివేత దారుణం..! కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం..!!

ప్రజలు మెచ్చే పాలనను అందించాలి తప్ప, ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామనడం దారుణమని కాంగ్రెస్‌ నగర కమిటీ అధ్యక్షుడు వి.గురునాథం ఖండించారు. నగర కమిటీ సమావేశం ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే జగన్‌ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. లోగడ అక్రమ కట్టడాలకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని, ఆ విధంగానే ప్రజావేదిక అక్రమ కట్టడమే అయితే ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు, వేముల శ్రీనివాసరావు, రాణిమేకల సతీష్‌, జోసెఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావేదికపై ఎంపీ విజయసాయి సంచలన ట్వీట్..! కూల్చి తీరుతామన్న ఎంపీ..!!

ప్రజావేదికపై ఎంపీ విజయసాయి సంచలన ట్వీట్..! కూల్చి తీరుతామన్న ఎంపీ..!!

ప్రజావేదికను కూల్చేయాలని.. అది అక్రమంగా కట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే ఈ ప్రకటనతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు సమావేశమై ఈ విషయంపై చర్చించి ఆందోళన చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కూల్చివేత వ్యవహారంపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

ఇకపై సాధ్యం కాదు..!చంద్రబాబు యూటర్న్‌ల వల్లే..!!

ఇకపై సాధ్యం కాదు..!చంద్రబాబు యూటర్న్‌ల వల్లే..!!

"నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవి. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు. ఇకపై సాధ్యం కాదు" అని వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్ చేశారు.

"విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయి. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు" అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leaders are furious over AP CM Jaganmohan Reddy's announcement that the praja vedika will be demolished. Vijayawada MP Kesineni, along with Yanamala Ramakrishna and Achchem Naidu, responded. Eliminating the praja vedika has caused two kinds of damage to the state treasury.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more