బాబు నోట ముందస్తు మాట.. రెడీగా ఉండండి తమ్ముళ్లు, జగన్‌పై వ్యతిరేకత అంటూ..
వ్యతిరేకతను కూడా ఓట్లుగా మార్చుకుంటున్నారు. ఏదో సానుభూతి చూపి ఎన్నికలకు వెళుతున్నారు. జమానాలో చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద మావోయిస్టులు దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ముందస్తుకు వెళ్లారు. కానీ ఫలితం తారుమారు అయిపోయింది. ఇటీవల కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లి.. తిరిగి అధికారం చేపట్టారు. ఇక ఇప్పుడు ఏపీలో ముందస్తు ముచ్చట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. మహానాడు నిర్వహణపై నేతలతో చంద్రబాబు సమీక్ష చేశారు. ఆ క్రమంలో ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు.

బాబు నోట ముందస్తు మాట..
చంద్రబాబు నోట కూడా ముందస్తు ఎన్నికల మాట వినిపించింది. ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. గడపగడపకు వైసీపీలో ఆ పార్టీ నేతలకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలే ప్రత్యక్ష ఉదహరణ అని వివరించారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలు బూటకం అని ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. గడపగడప కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారని గుర్తుచేశారు.

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత
ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి సీఎం జగన్‌కు తెలిసిందని చంద్రబాబు అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలు తెలుగు దేశం పార్టీపై ఆశ పెట్టుకున్నారని వివరించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లాలని పార్టీ కేడర్‌కు చంద్రబాబు సూచించారు.

రెండేళ్ల సమయం.. కానీ
ముందస్తు ఎన్నికల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. నాయకులు మాత్రం పదే పదే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఆ మేరకు పార్టీలు కూడా సన్నద్దం అవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం ముందస్తు గురించి ఆలోచిస్తుందని తెలిపారు. తమ పార్టీని కూడా సిద్దం చేస్తున్నారు. దీనిని బట్టి.. రెండేళ్ల సమయం ఉండగా.. ఏడాది...లేదంటే ఏడాదిన్నర ముందు ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.