విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ టు హైదరాబాద్: జగ్గయ్యపేట వద్ద ప్రైవేట్ బస్సు పల్టీ: 35 మందికి పైగా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని అనుమంచిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సిరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 45 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో అనుమంచిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పింది.. రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయే సందర్భంలో డ్రైవర్ అదుపు తప్పినట్లు చెబుతున్నారు. రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు.. బోల్తా కొట్టింది.

Private bus heading Hyderabad from Vizag overturned at Anumanchipalli near Jaggayyapeta

ఈ ఘటనలో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని తొలుత జగ్గయ్యపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కొందిరిని విజయవాడకు తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, విప్‌ సామినేని ఉదయభాను ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

English summary
A private bus heading Hyderabad from Visakhapatnam overturned at Anumanchipalli near Jaggayyapeta in Krishna district on early morning of Thursday. 35 passengers aboard have been hurt out of 45 and were shifted to local hospital and Vijayawada. No casualties reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X