విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్దరాత్రి చంద్రబాబు ఇంటి వద్ద వంగవీటి రాధాకృష్ణ హంగామా ... టీడీపీలో ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

వంగవీటి రాధాకృష్ణ .. పరిచయం అక్కర లేని పేరు. వంగవీటి మోహన్ రంగా కొడుకుగా బెజవాడ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నం చేసిన నేత. ప్రస్తుతం సైలెంట్ గా ఒకరకంగా చెప్పాలంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాధా కృష్ణ అర్దరాత్రి హంగామా చేశారు. ఒక్కసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు.

వంగవీటి రాధా పవన్ ను కలవటం వెనుక అంతర్యం అదేనా ? జనసేనలో ఈ సారైనా చేరిక పక్కానా ?వంగవీటి రాధా పవన్ ను కలవటం వెనుక అంతర్యం అదేనా ? జనసేనలో ఈ సారైనా చేరిక పక్కానా ?

ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన రాధా

ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన రాధా

గత ఎన్నికల ముందు వరకు వైసీపీ లో ఉండి విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం హంగామా చేసి , చాలా కాలం పాటు సందిగ్ధంలో కొనసాగి ఆ తర్వాత టీడీపీ తీర్ధం పుచ్చుకున్న రాధా గత ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్నారు. ఇక ఎన్నికల తర్వాత రాజకీయాలతోనే తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేసిన దాఖలాలు లేవు. ఏపీ రాజకీయాల్లో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నా చూస్తూ సైలెంట్ గా ఉన్నారు.

అర్ధరాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటివద్ద వంగవీటి రాధాకృష్ణ

అర్ధరాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటివద్ద వంగవీటి రాధాకృష్ణ


ఆ మధ్య రెండు సార్లు జనసేనాని పవన్ ను కలిసిన ఆయన జనసేన బాట పడతారని ప్రచారం జరిగింది. కానీ రాధా మాత్రం జనసేనలో కూడా చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి రాధా సడన్ గా నిన్న అర్ధరాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటివద్ద ప్రత్యక్షమై పార్టీ శ్రేణులకు షాకిచ్చారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు . ఈ నేపధ్యంలో ఉద్రిత వాతావరణం నెలకొంది.

చంద్రబాబును అరెస్ట్ చెయ్యటంతో ఇంటికి వెళ్ళిన రాధాకృష్ణ

చంద్రబాబును అరెస్ట్ చెయ్యటంతో ఇంటికి వెళ్ళిన రాధాకృష్ణ

బస్సు యాత్ర ను పోలీసులు అడ్డుకోవటంతో చంద్రబాబు అక్కడే బైఠాయించి ఆందోళన తెలియజేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు . ఇక ఈ నేపధ్యంలో బాబు అరెస్టు సమాచారం తెలుసుకున్న రాధా ఆయన ఇంటికి వెళ్లారు. లోకేశ్ తోపాటు ఇతర నేతలను కలుసుకుని మాట్లాడారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక ఉద్యమాలు ఏపీలో కొనసాగుతున్నాయి. ఇసుక కోసం పోరాటాలు జరిగాయి.

 వైసీపీ పాలనలో ఇప్పటివరకు నోరు మెదపని రాధా

వైసీపీ పాలనలో ఇప్పటివరకు నోరు మెదపని రాధా

టీడీపీ నేతల మీద దాడులు, కేసులు ఇలా టీడీపీ నేతలు ప్రతికూల వాతావరణంలో పోరాటం సాగిస్తున్నారు. అయినా సైలెంట్ గా ఉన్న రాధా సడన్ గా చంద్రబాబు ఇంటికి రావటం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న రాధా జగన్ ను ఓడించాలని కసితో పని చేశారు . పార్టీ అభ్యర్థుల కోసం కష్టపడ్డారు. రాష్ట్రంలో పార్టీ అధికారం పోగొట్టుకోవడంతో రాధాలో నైరాశ్యం అలముకుంది. ఈ క్రమంలో ఆయన ఆపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

అమరావతి విషయంలోనూ రాధా సైలెంట్ .. రాధా రాకతో పార్టీలోచర్చ

అమరావతి విషయంలోనూ రాధా సైలెంట్ .. రాధా రాకతో పార్టీలోచర్చ

అమరావతి కేంద్రంగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా, టీడీపీ నేతలు అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నా రాధా పాల్గొన్న దాఖలాలు లేవు . అలాంటి రాధా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా ? అసలు ఆయన చంద్రబాబు ఇంటికి వచ్చిన కారణం ఏంటి ? అన్న కోణంలో రాధా రాకపైనే చర్చ జరిగింది. దీంతో మళ్లీ ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంటికి వచ్చిన రాధా చంద్రబాబును కలవలేకపోయారు. దీంతో లోకేశ్, ఇతర నాయకులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.

English summary
Former MLA and TDP leader Vangaveeti Radha krishna, who has ruled out his involvement with politics after the election, suddenly appeared at Chandrababu's house in Undavalli at midnight yesterday and shocked the party leaders. Former chief minister Chandrababu was arrested by the police during a bus tour under the aegis of Amaravathi JAC. Upon hearing of Babu's arrest, Radha went to his house. He met other leaders along with Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X