విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారం రోజుల పాటు విజయవాడ స్టేషన్ కు రైళ్లన్నీ రద్దు-రైల్వేశాఖ క్లారిటీ ఇదే

|
Google Oneindia TeluguNews

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్ల రాకపోకలకు సంబంధించి ఓ వార్త షికార్లు చేస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్ధ ఆధునీకీకరణ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకూ అంటే తొమ్మిది రోజుల పాటు స్టేషన్ కు వచ్చే అన్ని రైళ్ల రాకపోకల్ని రద్దు చేసినట్లు ఈ ప్రచారం జరుగుతోంది. దీంతో వందలాది రైళ్లకు ఈ 9 రోజుల పాటు రద్దు లేదా దారిమళ్లించడం చేస్తున్నట్లు ఈ ప్రచారం సారాంశం.

సుమారు తొమ్మిది రోజులపాటు 118 రైళ్లను (రానుపోను) రద్దు, పాక్షిక రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎం.యల్వేందర్‌యాదవ్‌ తెలిపారంటూ ఈ వార్త ప్రచారంలోకి రావడంతో అంతా నిజమే అనుకున్నారు. రెండురోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై రైల్వేశాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. విజయవాడ యార్డులో నాన్-ఇంటర్ లాకింగ్ వ్యవస్ధ లో మరమ్మతులపై జరుగుతున్న ప్రచారంపై తాము స్పందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

railway clarified on rumours on cancellation of all trains to and from vijayawada junction

ప్రస్తుతం విజయవాడ రైల్వే యార్డులో ఎలాంటి నాన్-ఇంటర్ లాకింగ్ పనులు జరగడం లేదని, దీనిపై ప్రచారంలో ఉన్న ఫేక్ మెసేజ్ ను నమ్మవద్దని రైల్వే అధికారులు తెలిపారు. గత నెల 20వ తేదీలోపే ఈ పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. కొండపల్లి పరిధిలో ఈ పనులు జరుగుతున్నట్లు సర్కులేట్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని వారు తెలిపారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్ధ పనుల కారణంగా రైళ్లన్నీ రద్దయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజయవాడ రైల్వే డివిజన్ ప్రజాసంబంధాల అధికారి ప్రకటించారు.

English summary
railway officials on today reacted on rumours over cancellation of all trains to and from vijayawada station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X