విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పన్ను బాదుడు .. వృత్తి పన్ను పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం పన్ను బాదుడుకు తెరతీసింది . ఆర్ధిక కష్టాల నుండి బయటపడటానికి కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరణ చేసి, వృత్తి పన్ను పెంచి తాజాగా మరో కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఈ పన్ను బాడుడుపై మండిపడుతున్నారు .

ఏపీలో డిసెంబర్ 1 నుండి బియ్యం డోర్ డెలివరీ .. బియ్యం వద్దంటే నేరుగా డబ్బులు ఏపీలో డిసెంబర్ 1 నుండి బియ్యం డోర్ డెలివరీ .. బియ్యం వద్దంటే నేరుగా డబ్బులు

వృత్తిపన్నులను పెంచుతూ ఏపీ సర్కార్ తాజా ఉత్తర్వులు

వృత్తిపన్నులను పెంచుతూ ఏపీ సర్కార్ తాజా ఉత్తర్వులు

ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం గరిష్టంగా 2500 వరకు వృత్తి పన్ను వసూలు చేయనున్నట్లు గా తెలుస్తుంది.
వృత్తి పన్నులకు సంబంధించి రెండు శ్లాబుల లోని ఓ శ్లాబును పెంచుతున్నట్లు గా జీవో లో పేర్కొన్న ప్రభుత్వం గతంలో 1250 గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ .2 వేలకు పెంచింది. గరిష్టంగా ఏడాదికి 2500 రూపాయలు మించకుండా వృత్తి పన్ను వసూలు చేయనున్నట్లు గా పేర్కొంది.

ప్రస్తుతం సవరించిన ఉత్తర్వుల మేరకు రూ. 10 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు వృత్తి పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది.

గరిష్టంగా 2500రూపాయల వసూలుకు నిర్ణయం

గరిష్టంగా 2500రూపాయల వసూలుకు నిర్ణయం

రూ .10 లక్షల నుండి రూ. 25 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వారికి రెండు వేల రూపాయలు, రూ. 25 లక్షల నుండి ఆ పైన టర్నోవర్ ఉన్న వారికి 2500 రూపాయలు గా వృత్తి పన్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి సహకార సంఘాలకు, వే బ్రిడ్జ్ ఆపరేటర్లకు , వీడియో లైబ్రరీలు నిర్వహించే వారికి వృత్తిపన్ను 2500 రూపాయలు ఖరారు చేసింది. ఫుడ్ పాయింట్లకు, కర్రీ పాయింట్ లకు, క్యాంటీన్ లకు 2500 రూపాయలు వృత్తిపన్ను విధిస్తున్నట్లు గా పేర్కొంది.

సినీ పరిశ్రమ కార్మికులకు రూ. 2500 వృత్తిపన్ను .. కార్మికుల తీవ్ర అసహనం

సినీ పరిశ్రమ కార్మికులకు రూ. 2500 వృత్తిపన్ను .. కార్మికుల తీవ్ర అసహనం


సినీ పరిశ్రమలో పనిచేసే వారికి కూడా రూ. 2500 వృత్తి పన్ను విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ పెద్దగా లేదు. ఒకవేళ కొత్త గొప్ప సినీ పరిశ్రమలో పనిచేసే కళాకారులు ఉన్నా , వారికి ఉపాధి మృగ్యం గానే ఉంది. అయినప్పటికీ కచ్చితంగా ఏడాదికి సుమారు 2500 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడాన్ని సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు తప్పు పడుతున్నారు. తమకు ఉపాధి లేక నానా తిప్పలు పడుతుంటే , వృత్తి పన్ను కట్టాలని అడగడం ఎంత వరకు సమంజసమని వారు అంటున్నారు.

Recommended Video

YS Jagan కుమార్తె Harsha Reddy ఘనత, Bengaluru వెళ్తున్న జగన్ దంపతులు
వ్యాపారాలు లేక ఇబ్బందిపడుతున్న వాణిజ్య సంస్థలు .. ప్రభుత్వ పన్ను బాదుడుపై ఆగ్రహం

వ్యాపారాలు లేక ఇబ్బందిపడుతున్న వాణిజ్య సంస్థలు .. ప్రభుత్వ పన్ను బాదుడుపై ఆగ్రహం

వృత్తి పన్నును పెంచడంతో వివిధ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం వ్యాపారాలు లేక పడరాని పాట్లు పడుతున్న వాణిజ్య సంస్థల నిర్వాహకులు ప్రభుత్వం వృత్తి పన్ను పెంచడం తమకు ఇబ్బంది అని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీలో పని చేసుకోవాలంటే 2500 రూపాయలు కట్టాల్సి ఉందనే భావన చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వానికి గణనీయంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసుకోవాలనే ఆలోచనను చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు తప్పు పడుతున్నారు.

English summary
The AP government has opened the door to tax raising. The decision was made by raising the occupation tax for certain categories to get out of financial difficulties. It has recently issued another new notification amending the orders given earlier and raising the professional tax. Those who run small businesses are incensed by this tax.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X