విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీ అన్ని తిట్టినా ఉదాసీనంగా ఉంటారా ? అలిగిన రాజేంద్ర ప్రసాద్... బుజ్జగిస్తున్న తెలుగు తమ్ముళ్ళు .

|
Google Oneindia TeluguNews

టీడీపీలో వల్లభనేని వంశీ పెట్టిన చిచ్చు ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. టిడిపి ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ను బండ బూతులు తిట్టిన వైనంపై టిడిపి అధినాయకత్వం వెంటనే స్పందించకపోవడంతో టిడిపి నేత రాజేంద్రప్రసాద్ అలక వహించారు. ఇక ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు టీడీపీ ముఖ్య నాయకులు.

పప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీపప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీ

రాజేంద్రప్రసాద్ ను బండ బూతులు తిట్టిన వల్లభనేని వంశీ

రాజేంద్రప్రసాద్ ను బండ బూతులు తిట్టిన వల్లభనేని వంశీ

టీడీపీకి రాజీనామా చేసి కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వంశీ ఒక్కసారిగా వైలెంట్ గా మారారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద నిప్పులు చెరిగారు. ఓ చర్చా కార్యక్రమంలో వంశీ, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మధ్య జరిగిన డైలాగ్‌ వార్‌ ముదిరింది. వంశీ తన నోటికి పనిచెప్పారు. రాజేంద్రప్రసాద్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. చెత్త నా కొడకా, చెప్పుతో కొడతా, డొక్క పగులుద్ది అంటూ వల్లభనేని వంశీ పరుష పదజాలంతో రెచ్చిపోయారు.

తీవ్ర మనస్తాపంతో అధిష్టానంపై అలిగిన రాజేంద్రప్రసాద్

తీవ్ర మనస్తాపంతో అధిష్టానంపై అలిగిన రాజేంద్రప్రసాద్

అయితే ఈ విషయంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. తనపై వంశీ మాటలతో దాడి చేసినా పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడంపై అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీతో పాటు తనపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేసినా ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు చెబుతున్నారు. కనీసం తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని రాజేంద్రప్రసాద్‌ చాలా బాధపడ్డారని తెలుస్తుంది.

బోడె ప్రసాద్ డబ్బులు ఇచ్చారన్న వంశీ .. బోడె ప్రసాద్ ఖండించలేదని ఆవేదన చెందిన రాజేంద్రప్రసాద్

బోడె ప్రసాద్ డబ్బులు ఇచ్చారన్న వంశీ .. బోడె ప్రసాద్ ఖండించలేదని ఆవేదన చెందిన రాజేంద్రప్రసాద్

ఇక అంతే కాదు రాజేంద్రప్రసాద్ కుమార్తె పెళ్లి విషయంలో వల్లభనేని వంశీ 25 లక్షల రూపాయలు ఇచ్చానని, అలాగే బోడె ప్రసాద్ కూడా డబ్బులు ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు టిడిపి నేత బోడె ప్రసాద్ ఖండించలేదు అని రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలుస్తుంది. దీంతో బోడె ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ను బుజ్జగించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపణలను టీడీపీ నేత బోడె ప్రసాద్‌ ఖండించారు.

రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి బుజ్జగించిన బోడె ప్రసాద్ .. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని హితవు

రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి బుజ్జగించిన బోడె ప్రసాద్ .. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని హితవు

ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి మాట్లాడానని చెప్పిన బోడె ప్రసాద్ తాను వల్లభనేని వంశీ కి మంచి స్నేహితుడు అయినప్పటికీ, స్నేహం వేరు, రాజకీయం వేరన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని బోడె ప్రసాద్ హితవుపలికారు. వల్లభనేని వంశీ మోహన్ తనను వ్యక్తిగతంగా దూషించినా పార్టీ పట్టించుకోలేదని తీవ్ర వేదనకు గురైన రాజేంద్రప్రసాద్ వంశి వ్యాఖ్యలపై అధిష్టానం వెంటనే స్పందించలేదని, పార్టీ కోసం తాను మాట్లాడితే, తనను అంతగా బండ బూతులు తిట్టిన వంశీ వ్యవహారంలో తాపీగా సాయంత్రం స్పందించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ న్యాయ సహాయం చేస్తే వంశీపై పోరాడతా అంటున్న రాజేంద్రప్రసాద్

పార్టీ న్యాయ సహాయం చేస్తే వంశీపై పోరాడతా అంటున్న రాజేంద్రప్రసాద్

ఇక అంతే కాదు పార్టీ న్యాయ సహాయం చేస్తే వంశీపై పరువు నష్టం దావా వేసి, పోరాడతానని అనుచరులతో ఆయన అన్నట్లు తెలుస్తుంది. బోడె ప్రసాద్ తో పాటు అటు పార్టీ అగ్రనేతలు రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి నచ్చజెప్పి బుజ్జగించే ప్రయత్నం చేశారని సమాచారం. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ ను వంశీ తిట్టటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది అలా ఉంటె తాజాగా చంద్రబాబును సైతం సన్నాసి, వెధవ అంటూ, లోకేష్ ను పప్పు అంటూ వంశీ మరోమారు నోటికి పని చెప్పారు.

English summary
Gannavaram MLA Vallabhaneni vamshi lost his temper and hurling abuses on TDP MLC Rajendra prasad . Vallabhaneni descendant of TDP has now become a hot topic in AP. TDP leader Rajendra Prasad has unhappy with the late response on vallabhaneni vamshi abusive comments. TDP MLC Yalamanchili's Rajendra Prasad disappointed and he keep calm . TDP leader bode prasad and others went his home to appease him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X