విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అరకొర వసతులతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపును రద్దు చేసింది. రద్దు చేసిన కాలేజీల్లో
1. శ్రీ చైతన్య మహిళా జూనియర్ కళాశాల భాస్కర్ భవన్ బెంజ్ సర్కిల్ విజయవాడ కాలేజ్ కోడ్ 05067, 2. నారాయణ జూనియర్ కళాశాల ఆపోజిట్ ఈనాడు బెంజ్ సర్కిల్ విజయవాడ కాలేజ్ కోడ్ 05067 ఉన్నాయి. అంతేగాక, ఈ తరహా మిగతా కళాశాలలపై కూడా చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

 recognition of Sri chaitanya and Narayana colleges cancelled in andhra pradesh.

విద్యా సంస్థల మానిటరింగ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థల మానిటరింగ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. www.apsermc.ap.gov.in పేరుతో వెబ్ సైట్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. తమ దగ్గరున్న వసతులు, తాము పాటిస్తున్న ప్రమాణాలపై స్కూళ్లు, కాలేజీలు స్వయంగా ఆ వెబ్ సైట్ లో వివరాలు అప్ లోడ్ చేస్తాయని, ఆ డొమైన్ అందరికీ అందుబాటులో ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.

స్కూళ్లు, కాలేజీలు వెబ్ సైట్లో ప్రకటించిన వివరాలు నిజంగా లేకపోతే.. విజిల్ బ్లోయర్స్ ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వాలని జగన్ కోరారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కతికి చెక్ పెడతామని సీఎం తెలిపారు. అందుకోసం రెండు కమిషన్లు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

English summary
recognition of Sri chaitanya and Narayana colleges cancelled in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X