• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో మళ్లీ కలకలం: మాఫియాతో పొలిటికల్ లింకులు? -ప్రజలతో చెలగాటం -ఆగేదెప్పుడు?

|

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడ నగరంలో మరోసారి మటన్ మాఫియా కలకలం రేపింది. చెడు మాంసం విక్రయాల ద్వారా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ముష్కరుల గుట్టు మరోసారి రట్టు అయింది. మటన్‌, చికెన్ ఏది తినాలన్నా జనం భయపడేలా చాలా మంది వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. గతేడాది నవంబర్ లో సిటీలోని అన్ని ముఖ్యప్రాంతాల్లో ఇదే మాదిరిగా మటన్ మాఫియా ఆగడాలు బయటపడటం విదితమే.

డాక్టర్ శిల్పారెడ్డికి జగన్ పదవి అందుకేనా? -పోలవరం ఎత్తు తగ్గింపు -విశాఖలో సునామి: ఎంపీ రఘురామ

విజయవాడలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారులు అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం జంకడం లేదు. కొన్ని సందర్భాల్లో నిల్వ పెట్టిన దాన్ని అమ్ముతుండగా.. మరికొన్ని సార్లు కుళ్లిన మాంసాన్ని కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లో ఉంచిన మాంసాన్ని ఫ్రెష్‌ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తూ అంటగడుతున్నారు.

Rotten meat mafia in vijayawada: civic body officials seize several shops

దీనిపై అనేక సార్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో.. మున్సిపల్‌ అధికారులు మరోమారు తనిఖీలు చేపట్టారు. తాజా తనిఖీల్లో కూడా కలవరపడే వాస్తవాలను గుర్తించారు అధికారులు. విజయవాడ నగరంలో ఉన్న అనేక మటన్‌, చికెన్‌ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో కుళ్లిన మాంసాన్నే అమ్ముతున్నట్టుగా ఫిర్యాదులు అందాయి.

viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్

తనిఖీల్లో బీఫ్‌ మాంసాన్ని కూడా గుర్తించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయా నాన్‌వెజ్‌ వ్యాపారస్తులకు నోటీసులను జారీ చేశారు. రోజుల తరబడి నిల్వ పెట్టుకుని మరీ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు. పైకి మాత్రం వినియోగదారులకు తాజా మాంసాన్ని ఇస్తున్నట్టుగా నమ్మించే యత్నం చేస్తున్నారు.

Rotten meat mafia in vijayawada: civic body officials seize several shops

కరోనా నేపథ్యంలో ఇటీవల మాంసాన్ని తినేవారి సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు సొమ్ము చేసుకునే క్రమంలో.. వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా ఇష్టానుసారంగా నిల్వ ఉంచినవి, కుళ్లిన మాంసాన్ని అంటగడుతున్నారు. గోళ్లపాలెం సెంటర్‌లో ఇటీవల ఇదే తరహా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఒక్కచోట అని కాదు.. విజయవాడ నగర వ్యాప్తంగా అనేక కాలనీల్లో ఇదే తరహా అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మటన్ మాఫియా వెనక పొలిటికల్ లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాఫియాతో లింకులున్న దుకానాలపై తనిఖీలు చేస్తుంటే అడ్డుకునేలా ఫోన్లు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. పదే పదే దాడులు జరుగుతున్నా, పొలిటికల్ అండతోనే మాఫియా కొనసాగుతోందంటోన్న ప్రజలు.. ఈ దురాగతాలు ఎప్పుడు ఆగుతాయని ప్రశ్నిస్తున్నారు.

English summary
meat mafia conspiracy in once again raged Vijayawada. some traders are behaving in a fiery manner. Stored, rotten meat is sticking to people's lives in trouble. Traders are making it a habit to sell meat stored in Vijayawada. Although the authorities are conducting inspections from time to time and taking action but there is no hesitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X