ఎలుకలు విగ్రహం పడగొట్టాయంటే అవి కచ్చితంగా మతం మారి ఉంటాయి : సాదినేని యామిని చురకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై కొనసాగుతున్న దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలు ఏపీలోని హిందూ సంఘాలకు, ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న దాడులపై ఒక హిందూ మహా సంఘటనం జరగాల్సిన సమయం ఆసన్నమైందని, ఎక్కడైతే అవమానం జరిగింది అక్కడ ఒక సంకల్పం జరగాలని పిలుపునిచ్చిన సాదినేని యామిని తాజాగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో పరిస్థితి పై మరోసారి భగ్గుమన్నారు.
ఏపీలో ఆగని విగ్రహాల విధ్వంస కాండ .. టెక్కలిలో మరోమారు బుద్ధుడి విగ్రహం ధ్వంసం

యాభై ఏళ్లుగా ఏమీ చేయలేని ఎలుకలు హఠాత్తుగా విగ్రహాన్ని పడగొట్టాయా ?
విజయవాడలో బస్టాండ్ సమీపంలో ఉన్న రామాలయంలో సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఎలుకలు పడేయడం వలనే విగ్రహం విరిగిపోయిందని సిఐ వ్యాఖ్యానించడం పట్ల హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఈ వ్యవహారంపై సాదినేని యామిని యాభై ఏళ్లుగా ఏమీ చేయలేని ఎలుకలు హఠాత్తుగా విగ్రహాన్ని పడగొట్టాయంటే , ఖచ్చితంగా అవి నిన్నో మొన్నో మతం మారి ఉంటాయంటూ మండిపడ్డారు.

పిల్లుల అండతోనే కావొచ్చు : యామినీ చురకలు
ఇక పిల్లుల అండ చూసుకునే ఇలా చేసి ఉంటాయంటూ సాదినేని యామిని ఎలుకలు పడేయటం వల్ల విగ్రహం విరిగిపోయింది అన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇదే సమయంలో మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, వెక్కిరించేవారు, అవమానించే వారు ,అడ్డుకునే వారు, అపహాస్యం చేసే వారు ఎంతమంది ఉన్నా మన ధర్మాన్ని మనం పాటిస్తూ వెళ్లడమే మంచిదని సాదినేని యామిని చెప్పుకొచ్చారు. మనమేంటో ద్వేషించే వారికి తప్పక తెలిసి వస్తుందంటూ ఆమె పేర్కొన్నారు.

చైనాకి ఊడిగం చేస్తూ, హైందవాన్ని చులకన చేస్తే .. పళ్ళు రాలగొడతారు
నారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడిన సాదినేని యామిని చైనాకి ఊడిగం చేస్తూ, హైందవాన్ని మాత్రమే చులకన చేసి నాశనం చేసే నారాయణ గారు, మీరు ఇంకా ఇలా పేట్రేగి వాగే ఆ నోరు పనిచేస్తుంది అంటే అది మా దేవుడు బిక్ష. హిందూ దేవుళ్లను బొమ్మ గిమ్మా అంటే పళ్ళు రాలగొడతారు హిందువులు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పై అసహనం వ్యక్తం చేసిన సాదినేని యామిని రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలే ఈ చర్యలకు కారణం అన్నారు .
యంగ్ బ్యూటీ మాసూమ్ శంకర్ ఫోటో గ్యాలరీ..

విగ్రహ విధ్వంసంపై హిందువులు మేల్కోవాల్సిన అవసరం
రెండు ప్రాంతీయ పార్టీల మధ్య గొడవలు , ద్వేషాలు, కక్ష సాధింపు చర్యలు సాక్షాత్తు రాములవారి శిరస్సును ఖండించే వరకు తెచ్చిందని విజయ నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆలయాలపై కొనసాగుతున్న దాడులపై, విగ్రహ విధ్వంసంపై హిందువులు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందని, ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సాదినేని యామిని తెలిపారు.