విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం బ్యారేజ్ పైన సీప్లేన్స్ ... ఏపీతో సహా 14 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్ ల ఏర్పాటుకు కేంద్రం ప్లాన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం బ్యారేజి పై సీప్లేన్స్ దిగే ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం బ్యారేజీ తోపాటుగా, 14 ప్రాంతాలలో వాటర్ ఏరో డ్రోమ్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్ర సర్కార్ పర్యాటకంపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తుంది .

గుజరాత్ యొక్క నర్మదా జిల్లాలోని కేవాడియా సమీపంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుండి అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి సీప్లేన్ సేవను విజయవంతంగా ప్రారంభించిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది .

కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే .. కేశినేని నానీ, విజయసాయిలతో పాటు పోటీలో బీజేపీ నేతలు కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే .. కేశినేని నానీ, విజయసాయిలతో పాటు పోటీలో బీజేపీ నేతలు కూడా

ప్రకాశం బ్యారేజ్ తో సహా 14 వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయనున్న కేంద్ర సర్కార్

ప్రకాశం బ్యారేజ్ తో సహా 14 వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయనున్న కేంద్ర సర్కార్


దేశవ్యాప్తంగా మరో 14 వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఏపీలోని ప్రకాశం బ్యారేజ్ తో పాటుగా, లక్షద్వీప్, అండమాన్ & నికోబార్, అస్సాం, మహారాష్ట్ర మరియు ఉత్తరాఖండ్ సహా వివిధ మార్గాల్లో సీప్లేన్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద మరో 14 వాటర్ ఏరోడ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

దీనికోసం విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా , మరియు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయమని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను అభ్యర్థించాయి .

 రెగ్యులర్ సీప్లేన్ సర్వీసులను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పిన నౌకాయాన శాఖా మంత్రి

రెగ్యులర్ సీప్లేన్ సర్వీసులను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పిన నౌకాయాన శాఖా మంత్రి

ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడానికి జెట్టీలను ఏర్పాటు చేయడంలో సహాయం కోరాయి అని నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.

గుజరాత్‌లో సీప్లేన్ సర్వీసును ప్రారంభించిన తరువాత, ఏపీలో ప్రకాశం బ్యారేజీ , గౌహతి, అండమాన్ & నికోబార్, ఉత్తరాఖండ్ సహా వివిధ మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులను ప్లాన్ చేస్తున్నట్లు నౌకాయాన శాఖా మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు . తొలి సీప్లేన్ సర్వీస్ నో-ఫ్రిల్స్ క్యారియర్ స్పైస్ జెట్ మాల్దీవుల నుండి ఒక సీప్లేన్‌ను చార్టర్డ్ చేసిందని, ఇతర ప్రదేశాలలో సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి మరిన్ని సీప్లేన్‌లను తీసుకుంటామని అధికారి తెలిపారు.

Recommended Video

#Seaplane: India’s Maiden Seaplane Flight Service మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి?
పర్యాటకంగా మరింత ఊతం ఇచ్చే నిర్ణయం

పర్యాటకంగా మరింత ఊతం ఇచ్చే నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజ్, ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ ఆనకట్ట, గౌహతి రివర్ ఫ్రంట్ , అస్సాంలోని ఉమ్రాంగ్సో రిజర్వాయర్, ఖిండ్సి ఆనకట్ట , మహారాష్ట్రలోని ఎరాయ్ డ్యామ్, లక్షద్వీప్‌లోని మినికోయ్ , కవరట్టి, హావ్లాక్, నీల్, అండమాన్ నికోబార్ దీవులలోని లాంగ్ అండ్ హట్ బే ఐలాండ్స్ , గుజరాత్‌లోని ధరోయి మరియు శత్రుంజయ లలో 14 ఏరో డ్రోమ్స్ ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదన ఉన్నట్టు నౌకాయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం బ్యారేజ్ పై కూడా వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటు చేసి సీప్లేన్స్ తిరిగేలా చేస్తే పర్యాటకంగా ఏపీకి మరింత ఊతం ఇచ్చినట్లవుతుంది.

English summary
The Center is proposing to set up a seaplane landing on the Prakasam Barrage in the state of Andhra Pradesh. In addition to the Prakasam Barrage in the state of Andhra Pradesh the Government is looking to set up 14 more water aerodromes across the country after the successful launch of maiden seaplane service by Prime Minister Narendra Modi between the Statue of Unity near Kevadiya in Gujarat’s Narmada district and Sabarmati Riverfront in Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X