విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో 7గురు నేవీ సిబ్బందిని అరెస్ట్.. పాకిస్తాన్‌తో గూఢచర్యంపై అనుమానాలు

|
Google Oneindia TeluguNews

విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్న...దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేవీ సిబ్బందిని ఇంటలీజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలు సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్తాన్‌కు ఇస్తున్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులతో కలిసి డాల్ఫిన్ నోస్ అనే అపరేషన్ ద్వార రాష్ట్ర అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏడుగురు నేవి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు పలువురు ఇతర అనుమానితులకు కూడ అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Seven Navy personnel and a hawala operator, were arrested

మరోవైపు హవాల అధికారులతో కూడ వీరికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. పాకిస్తాన్‌లోని పలువురు వ్యాపారుల నుండి హవాలా వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే హవాలా ఏజెంట్‌ కూడ అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుండి హవాల డబ్బును కూడ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నేవీ అధికారుల అరెస్ట్ అనంతరం వారిని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు తరలించారు. రహస్య సమాచారంకు సంబంధించి విచారణలో తేలాల్సి ఉంది.

English summary
Seven Navy personnel and a hawala operator, were arrested from across India in an espionage racket which has alleged links to Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X