విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో మున్సిపల్ అధికారులకు ఝలక్ .. అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులు అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి . మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేస్తూ నిన్న ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలోనే విజయవాడలోని అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ఏపీలో ఏసీబీ రైడ్స్ .. మున్సిపల్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసులే టార్గెట్ గా సోదాలు ఏపీలో ఏసీబీ రైడ్స్ .. మున్సిపల్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసులే టార్గెట్ గా సోదాలు

మున్సిపల్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు .. రంగంలోకి ఏసీబీ

మున్సిపల్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు .. రంగంలోకి ఏసీబీ

అవినీతి నిరోధక శాఖాధికారులు నిన్న ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు , టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై జరిపారు. ఇటీవల టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందిన నేపధ్యంలో నిర్వహించిన దాడుల్లో అనేక అంశాలు గుర్తించారు.అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల పట్ల కూడా అధికారుల తీరు పసిగట్టిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

విజయవాడలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు

విజయవాడలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు

విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు . ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో పలు కీలక రికార్డులును పరిశీలిలించి అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు . ఇక ఇదే క్రమంలో విజయవాడ వన్‌టౌన్‌ పరిధిలోని అక్రమ కట్టడాలను ఏసీబీ అధికారులు బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలకు సంబంధించి అనధికార అనుమతులపై విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు వెల్లడించారు.

అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల కొరడా .. లోతుగా విచారణ

అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల కొరడా .. లోతుగా విచారణ

నిబంధనలకు విరుధ్దంగా నిర్మించిన భవననాల యజమానులపైనే కాకుండా, అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశించనున్నట్లు చెప్పారు. కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌లు తమ డ్యూటీనీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ లోనూ, మున్సిపల్ కార్యాలయాలలోనూ బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌లు, లైన్‌మెన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

English summary
ACB officials conducted searches at municipal and town planning section offices in several districts of the state. ACB conducts the raids at municipality office town planning section in vijayawada. officials identified the permissions given to the illegal constructions. ACB officials inquiring deeply in the illegal constructions permissions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X