విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడివాడలో గాన గంధర్వుడు విగ్రహం.!ఈనెల 11 న బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవకు సరైన గుర్తింపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్బంలో బాలు అకాల మరణాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోయారు. బాలు లేని సంగీత ప్రపంచాన్ని. సినిమా పరిశ్రమను, నేపథ్య గానాలను ఎవ్వరూ ఊహించుకోలేకపోయారు. బాలు లేని చిత్ర పరిశ్రమను చూసి కంటతడిపెట్టని ప్రేక్షలు ఉండరు. అలాంటి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నుండి సరైన గుర్తింపు దక్కుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బాలు విగ్రహాన్ని తొలిసారి క్రిష్ణా జిల్లా గుడివాడలో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గాయకుడు బాలుకు సరైన గుర్తింపు.. గుడివాడలో ఎస్పీబీ తొలి విగ్రహావిష్కరణ..

గాయకుడు బాలుకు సరైన గుర్తింపు.. గుడివాడలో ఎస్పీబీ తొలి విగ్రహావిష్కరణ..

విలక్షణ గాయకుడు, పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మ విభూషణ్, డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మొదటగా గుడివాడ పట్టణంలో నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు బీ రామమోహనరెడ్డి , కోశాధికారి విన్నకోట సత్యనారాయణ, సభ్యులు లంకపల్లి ప్రకాష్ , బీవీ సత్యం, పీ శ్యామ్ తదితరులు సంప్రదించారు. గుడివాడ పట్టణం రాజబాపయ్యచౌక్ లోని అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం సమీపంలోనే ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలయజేపారు.

40వేల పైచిలుకు పాటలు పాడిన బాలు.. ఎవ్వరికి సాద్యం కాదన్న మంత్రి కొడాలి నాని..

40వేల పైచిలుకు పాటలు పాడిన బాలు.. ఎవ్వరికి సాద్యం కాదన్న మంత్రి కొడాలి నాని..

ఇదిలా ఉండగా బొమ్మినంపాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అప్పారావు ఈ విగ్రహానికి రూపకల్పన చేశారన్నారు. ఈ నెల 11 వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ, ఆరు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని, 25 సార్లు ఉత్తమ జాతీయ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పురస్కారాలను అందజేశాయన్నారు .

గుడివాడ గడ్డ కళాకారుల అడ్డ.. ప్రశంసలతో ముంచెత్తిన కొడాలి..

గుడివాడ గడ్డ కళాకారుల అడ్డ.. ప్రశంసలతో ముంచెత్తిన కొడాలి..

అంతే కాకుండా ఎంతో మంది నూతన గాయనీ గాయకులను కళారంగానికి పరిచయం చేసిన ఎస్పీ బాలు విగ్రహాన్ని సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. కళాకారులకు పుట్టినిల్లు గుడివాడలో ఎస్పీ బాలు విగ్రహాన్ని తన చేతులమీదుగా ఆవిష్కరించే అదృష్టం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు మంత్రి కొడాలి నాని. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలను పాడి ఘంటసాల లేనిలోటు తీర్చిన మహాగాయకుడు ఎస్పీ బాలు అని అన్నారు . ఎస్పీ బాలు గాయకుడిగానే పరిమితం కాకుండా నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బహుముఖ సేవలందించారన్నారు నాని.

బాలు విగ్రహావిష్కరణ జరగడం హర్షనీయం.. కళాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్న మంత్రి నాని..

బాలు విగ్రహావిష్కరణ జరగడం హర్షనీయం.. కళాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్న మంత్రి నాని..

గుడివాడ ప్రాంతం నుండి ఎందరో కళాకారులు నాటక, సినీరంగాల్లో రాణి ప్రపంచస్థాయి ఖ్యాతినార్జించారన్నారు. గుడివాడ ప్రాంతం నుండి ఎన్టీఆర్, ఏఎన్నార్, కైకాల, ఘంటసాల వంటి ఎందరో కళాకారులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా వెలుగొందారన్నారు. అంతటి చరిత్ర కలిగిన కళాకారుల వారసులుగా నేటికీ కళాకారుల సమాఖ్య తరపున అనేక మంది కళాకారులు కళారంగానికి సేవలందిస్తూ వస్తున్నారన్నారని కొడాలి నాని గుర్తు చేసారు. కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కళాకారులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వీటిని శాయశక్తులా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

English summary
Kodali Srivenkateswara Rao, Minister of State for Civil Supplies and Consumer Affairs, said it was commendable that the statue of the distinguished singer, Padma Shri, Padma Bhushan, Padma Vibhushan and Dr SP Bala Subrahmanyam was first erected in Gudivada town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X