విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిడ్డకు పాలిస్తుండగా, తల్లి స్తనంపై కాటేసిన పాము.. బిడ్డ కోసం ఆ తల్లి ఏం చేసిందంటే

|
Google Oneindia TeluguNews

చిన్నారికి పాలు ఇస్తుండగా ఓ పాము తల్లి స్తనంపై కాటేయడంతో ఆ తల్లి మరణించిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అయితే మరణానికి ముందు తన బిడ్డను కాపాడుకోవటం కోసం ఆ తల్లి చేసిన ప్రయత్నం తల్లిప్రేమకు అద్దం పడుతుంది . ఈ పాము కాటు ఘటనలో అదే పాము కాటుకు మరో యువకుడు ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు . ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

మహారాష్ట్ర చంద్రపూర్ మండలం సోనాపూర్ నుంచి కొందరు కూలీలు కూలీ పనుల నిమిత్తం కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం లోని ఊటుకూరు వచ్చారు. సదరు కూలీలు మిరప కోతలకు వెళ్తున్నారు . వారంతా గ్రామంలోని బీసీకాలనీ స్కూల్ వద్ద ఒక గుడారంలో ఉంటున్నారు .

snake bite on mothers breast .. mother efforts to protect her baby

అయితే రాత్రి సమయంలో అందరూ నిద్రపోతుండగా ఒక చిన్నారి పాప ఆకలితో ఏడ్చింది . దీంతో పాప తల్లి శృతి ప్రమోద్ భోయర్ తన బిడ్డ ఆకలి తీర్చటం కోసం పాలిచ్చారు .

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక పాము తల్లి రొమ్ము భాగంపై కాటేసింది . పాము బిడ్డను కూడా కాటేస్తుందేమో అని భయపడిన ఆ తల్లి దాన్ని చేత్తో పట్టుకుని బయటకు విసిరేసి బిడ్డను కాపాడుకుంది . అయితే తల్లి పామును బయటకు విసిరేసిన క్రమంలో అక్కడే నిద్రిస్తున్న రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై ఆ పాము పడటంతో అతడిని సైతం పాము కాటేసింది. దీంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు .ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

బిడ్డకు పాలిస్తూ పాము కాటుకు గురైన తల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది . యువకుడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది .శృతి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు .

English summary
The tragic incident took place in Krishna district when a snake bit the mother's breast while she was giving milk to the baby and the mother died. But the mother's effort to protect her child before death mirrors motherly love. Another young man was killed by the same snake bite in this snake bite incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X