విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు సింగిలైతే.. జగన్ డబుల్ స్టిక్కర్!: ఏపీ సర్కారుపై సోము వీర్రాజు విమర్శల దాడి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారాడు.. ఇప్పుడు జగన్ డబుల్ స్టిక్కర్ స్టిక్కర్ ముఖ్యమంత్రి‌గా తయారయ్యారని విమర్శించారు.

ప్రధాని నిధులిస్తే జగన్ పేరు పెట్టుకుంటారా? సోము చురకలు

ప్రధాని నిధులిస్తే జగన్ పేరు పెట్టుకుంటారా? సోము చురకలు


కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ పథకానికి జగన్ పేరు పెట్టుకోవడమేంటో అర్థం కావడం లేదని సోము వీర్రాజు చురకలంటించారు. . ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని మండిపడ్డారు. మరోవైపు, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పే నైతిక హక్కు సీఎం జగన్ కు లేదని అన్నారు.

అమరావతిలోనే అద్భుతమైన రాజధాని అంటూ సోము వీర్రాజు

అమరావతిలోనే అద్భుతమైన రాజధాని అంటూ సోము వీర్రాజు

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో బీజేపీకే చిత్తశుద్ధి ఉందన్నారు సోము వీర్రాజు. మాట తప్పను.. మడమ తిప్పను.. ఇక్కడే క్యాపిటల్ కడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మూడు రాజధానులు కడతానని చెప్పే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పుడు ఎలా మాట తప్పుతారని ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం గతంలో బీజేపీ విభజించిన రాష్ట్రాల్లో రాజధానులు నిర్మించుకున్న అంశాన్ని ఈ సందర్భంగా సోము వీర్రాజు గుర్తు చేశారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రాజధాని కట్టారనీ.. హౌసింగ్ బోర్డుతో సైలెంట్‌గా అక్కడ రాజధానిని నిర్మించుకున్నారని తెలిపారు. ఇక జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లోనూ రాజధానులు నిర్మించుకున్నారన్నారు. ఏపీకి వచ్చేసరికి వచ్చేసరికి సరైన దిశ, దశ లేనటువంటి రాజకీయాలతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. రాజధాని విషయంలో ఒక్క భారతీయ జనతా పార్టీకే కమిట్మెంట్ ఉందని స్పష్టం చేశారు సోము వీర్రాజు. అమరావతిలోనే అద్భుతమైన రాజధానిని కడతామని ఆయన తెలిపారు.

ఇందిరా గాంధీలాంటి వారినే ఓడించారంటూ సోము వీర్రాజు

ఇందిరా గాంధీలాంటి వారినే ఓడించారంటూ సోము వీర్రాజు

అంబేద్కర్ నడయాడిన ప్రాంతాన్ని పంచ తీర్ధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు సోము వీర్రాజు. భారత రాజ్యాంగం విశిష్టత ను వివరిస్తూ ప్రధాన మంత్రి మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పైన ప్రజలు పూర్తి విశ్వాసం చూపారని... సామాన్యుడి కి ఓటు హక్కు కల్పించడం తోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులనే ప్రజలు ఓడించడం ఇందుకు నిదర్శనమన్నారు. కాశ్మీర్ విషయాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలోనే పొందుతారని.. విడివిడిగా ఏ రాజ్యం వుండడానికి వీలు లేదని వెల్లడించారు.

Recommended Video

Somu Veerraju Comments On Chandrababu బీజేపీ ఏనాడూ వెన‌క‌డుగు వేయ‌లేదు !
టీడీపీ ఐదేళ్లలో చేసింది.. వైసీపీ రెండున్నరేళ్లలోనే..: జీవీఎల్ ఫైర్

టీడీపీ ఐదేళ్లలో చేసింది.. వైసీపీ రెండున్నరేళ్లలోనే..: జీవీఎల్ ఫైర్


మరోవైపు, ఏపీ సర్కారు విధానాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించన అంశాలను ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ తో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలు, ఆర్థిక పరిస్థులపై ప్రధానంగా చర్చించనట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 86 వేల కోట్లు అప్పు చేస్తే.. రెండున్నరేళ్లలోనే ఈ ప్రభుత్వం అంతకు రెట్టింపు అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఓటు బ్యాంక్, రాజకీయ అవసరాల కోసం మాత్రమే ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందని జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.

English summary
BJP AP president Somu Veerraju slams CM YS Jagan, due to his name for central schemes .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X