విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిని కాపాడలేకపోతే.. ఈ పదవులెందుకు:వ్యక్తిగతంగా పోరాడుతా : సుజనా సంచలన వ్యాఖ్యలు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kesineni Nani Slams YS Jagan Over Capital Amaravathi Issue ! || Oneindia Telugu

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అమరావతిలో పరిస్థితుల పైన ఆవేదన వ్యక్తం చేసారు. రైతుల ఆందోళన చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి ని కాపాడుకోలేక పోతే..తమకు ఈ పదవులు ఎందుకని వ్యాఖ్యానించారు. ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుందని సుజనా స్పష్టం చేసారు. అదే సమయంలో పార్టీ పరంగా రైతులకు మద్దతు ఉంటుందని చెబుతూనే..తాను వ్యక్తిగతంగా కూడా పోరాడుతానని తనకు మద్దతుగా నిలవాలని కోరారు. అమరావతిని అంగుళం కూడా మార్చలేరని సుజనా తేల్చి చెప్పారు. ఇప్పుడు సుజనా చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ మొదలైంది.

అమరావతి గ్రామాల్లో టెన్షన్:స్వల్ప లాఠీఛార్జ్.. మహిళలకు గాయాలు: యుద్ద వాతావరణం..!అమరావతి గ్రామాల్లో టెన్షన్:స్వల్ప లాఠీఛార్జ్.. మహిళలకు గాయాలు: యుద్ద వాతావరణం..!

 అమరావతి లేకుంటే పదవులు వద్దు..

అమరావతి లేకుంటే పదవులు వద్దు..


అమరావతి ఉద్యమంలో ప్రభుత్వం తీరు పైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళల పట్ల పోలీసులు.. ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. రాజధాని ఉద్యమంలో మహిళల ఆవేదన బాధ కలిగిస్తోందని... 144 సెక్షన్‌కు సమయం, సందర్భం ఉండదా అని ప్రశ్నించారు. రాజధానిని కాపాడలేకపోతే తమకు ఈ పదవులు ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

వ్యక్తిగతంగా పోరాడుతా

వ్యక్తిగతంగా పోరాడుతా

కేంద్రం ప్రతి నిమిషం ఇక్కడి పరిస్థితులు తెలుసుకుంటోందని.. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి స్పష్టం చేసారు. పార్టీ కూడా రాజధానికి సహకరిస్తుందిని.. అవసరమైతే వ్యక్తిగతంగా పోరడతానని ప్రకటించారు. అమరావతిని అంగుళం కూడా మార్చలేరని సుజనా ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో పోలీసుల తీరు పైనా సుజనా ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజీపీ.. పార్టీ తొత్తుగా మారితే ఆయన సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.రాజధాని గ్రామాల్లో ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు... వైకాపా ర్యాలీకి అనుమతులు ఎలా ఇస్తున్నారని నిలదీశారు. రైతులను మీ కులమేంటని పోలీసులు అడగడం దారుణమన్నారు.

 ఇటువంటి సీఎంను చూడలేదు..

ఇటువంటి సీఎంను చూడలేదు..

మహిళలు, రైతులు దుర్గమ్మ గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు సుజనా చౌదరి. రాజధాని గ్రామాల్లోని దేవాలయాల్లో పూజలు చేసుకోవం తప్పా అని ప్రశ్నించారు. ఏది చేయాలన్నా చట్ట ప్రకారం చేయండంటూ.. ఆరు నెలల్లో ఇంత దారుణంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించి పైశాచిక ఆనందం పొందినట్లుగా సీఎం వ్యవహారం ఉందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజా స్వామ్య స్ఫూర్తితో 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలని... మేధావులు, ఎన్జీవోలు, పెన్షనర్లు కదం తొక్కాలని పిలుపునిచ్చా రు. రాష్ట్ర ప్రజలకు మద్దతుగా భాజపా పోరాడుతుందని... ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటామని సుజనా వివరించారు.

English summary
Rajyasabha Member Sujana sesationa comments on Amaravati agiataion. He syas if not svae amaravati no value for his post as MP. He says central govt will interfere in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X