• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టార్గెట్ జగన్: వారంతా ఒక్కటవుతున్నారు! మంత్రులు, సీనియర్లపై సీఎం అసహనం!

|
  YS Jagan Emotional Speech || ఇంగ్లీషు మీడియం వ్యతిరేకిస్తే నిలదీయండి || Oneindia Telugu

  ఏపీలలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా ఆరు నెలలు పూర్తి కాలేదు. ఆరు నెలల కాలంలోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ నాటి తొలి ప్రసంగంతో ప్రకటించిన విషక్షం. కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం అదే సమయం సరైనదిగా నిర్ణయించుకున్నారు. కొత్త ప్రభుత్వం..ఎప్పుడూ పాలన చేసిన అనుభవం లేకపోవటం..అందునా ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలవటంతో చాలా మందికి అవకాశాలు లేక లోలోపల ఉండే అసంతృప్తి అవకాశంగా మలచుకోవాలని భావించారు. అదే సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల పైన విమర్శలు మొదలు పెట్టారు. వ్యూహాత్మకం గా జాతీయ స్థాయిలోనూ..ఇటు రాష్ట్రా స్థాయిలో జనసేన..బీజేపీ సైతం పవన్ ను లక్ష్యంగా చేసుకొనేలా వ్యవహరించారు. ఇక, ఇప్పుడు మత పరమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక, వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యే లు సైతం తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ చెబుతోంది. కానీ, వీటన్నింటికీ ధీటుగా ఎదుర్కోవటంలో వైసీపీ వెనుకబడి ఉంది. అందుకే ప్రజలకే నేరుగా సీఎం వివరిస్తున్నారు. కానీ, జరుగుతున్న పరిణామాల మీద జగన్ సైతం కొంత ఆందోళనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి..జగన్ నిలబడతారా..చెప్పినట్లుగా వీటన్నింటినీ తిప్పి కొడతారా..

  శత్రువులు ఏకమయ్యారు.. పోరాటం కొనసాగిస్తా: జగన్ భావోద్వేగం!

  జగన్ లక్ష్యంగా వారంతా ఒక్కటవుతున్నారా..

  జగన్ లక్ష్యంగా వారంతా ఒక్కటవుతున్నారా..

  ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఏపీలో రాజకీయం సాగుతోంది. జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం పైన విమర్శలు పరిపాటిగా మారుతున్నాయి. ప్రతీ విషయాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్లటంలో టీడీపీ సక్సెస్ అవుతోంది. వారికి కొన్ని అంశాల్లో జనసేన..బీజేపీ పరోక్షంగా మద్దతిస్తున్నాయి. ముఖ్యమంత్రి పైన ప్రతిపక్షంగా టీడీపీ తొలుత ప్రజల్లోనూ..ఆ తరువాత ఢిల్లీలోనూ డామేజ్ చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ప్రజల మద్దతుతో గెలిచిన జగన్ ను ప్రజల్లోనే డామేజ్ చేయటం..తనను బీజేపీకి దూరం చేసి..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటున్న జగన్ ను వారికి దూరం చేయటం..తద్వారా జగన్ ను బలహీనపర్చటం కోసం టీడీపీ పక్కా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇక, పవన్ కళ్యాన్..టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇందులో భాగంగానే ఉన్నాయి.

  కొత్త మత పరంగా తీవ్ర ఆరోపణలు

  కొత్త మత పరంగా తీవ్ర ఆరోపణలు

  ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మత పరమైన ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి మతం గురించి..తిరుమలలో శ్రీవారి దర్శనం గురించి..డిక్లరేషన్ ప్రస్తావన.. జెరూసెలం యాత్రికులకు ఆర్దిక సాయం..ఇమాంలకు గౌరవ వేతనం వంటి అంశాలను తెర మీదకు తెచ్చి..ఇక వర్గంలో వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు సాగుతున్నాయని వైసీపీ అనుమానిస్తోంది. ఇక, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల నిర్ణయం వెనుక ఒక మతం కోసమే అంటూ చేస్తున్న ఆరోపణలు వారి అసలు లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలు జగన్ పైన ఇతర అంశాలను ప్రస్తావించే సమయంలోనూ..ఖచ్చితంగా మత పరంగా విమర్శలు చేస్తున్నారు. పవన్ సైతం జగన్ తిరుమల ప్రసాదం తీసుకుంటారా అంటూ అనుమానం క్రియేట్ చేసారు. సుజనా చౌదరి సైతం జెరూసలెం యాత్రికులకు ఇచ్చిన ఆర్దిక సాయం అమర్నాధ్ యాత్రికులకు ఇస్తారా అంటూ వ్యాఖ్యానించారు.

  ఎంపీలు..ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారంటూ

  ఎంపీలు..ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారంటూ

  ఇక, వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యేలు అనేక మంది తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నుండి బీజేపీ చేరిన ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ మాజీ మంత్రి వైసీపీ నుండి పది మందికి పైగా ఎంపీలు సర్దుకుంటున్నారని..ముందు సొంత ఇంటిని సరిదిద్దుకోవాలని వ్యాఖ్యానించారు. సొంత ఎంపీనే బీజేపీ తో దగ్గర ఉండటం పైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల మీద సైతం ముఖ్యమంత్రి ఫోకస్ చేసారు. ఇదే సమయంలో జగన్ పైన బీజేపీ నేతల్లో వ్యతిరేకత పెంచటమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది.

  మంత్రులు..సీనియర్లకు పట్టటం లేదంటూ

  మంత్రులు..సీనియర్లకు పట్టటం లేదంటూ

  ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా.. ప్రతీ నిర్ణయం పైన ఆరోపణలు చేస్తున్నా..తిప్పి కొట్టటం లో మాత్రం అధికార వైసీపీ వెనుకబడి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష పార్టీలు అంతగా అధికార పార్టీ పైనా..ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తుంటే అప్పుడప్పుడు..సమయం దొరికినప్పుడు అనే విధంగా అక్కడక్కడా ఒకరిద్దరు నేతలు స్పందిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన ముఖ్యమంత్రి సైతం ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు బయటకు కనబడపకపోయినా..జగన్ లక్ష్యంగా ఒక్కటిగా వ్యవహరిస్తున్నా...ఒక్కటిగా ఉండాల్సిన అధికార పార్టీ నేతలు మాత్రం ఆ విధంగా వ్యవహరించలేదనే అభిప్రాయం పార్టీలోనే వినిపిస్తోంది.

  అంగీకరించిన జగన్.. పోరాడుతానంటూ

  అంగీకరించిన జగన్.. పోరాడుతానంటూ

  ముఖ్యమంత్రి జగన్ సైతం జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదనతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా....తనకు శత్రువులు ఎక్కువ అని చెప్పిన జగన్..ఇప్పుడు వారంతా ఒక్కటయ్యారని వ్యాఖ్యానించారు. తాను..మాత్రం పోరాడుతానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన మీద అపనిందలు వేస్తున్నారంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు. తాను వారి మీద పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఏపీలో మాత్రం రాజకీయ వ్యూహాలు..మైండ్ గేమ్ లు పదునెక్కుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇవి మరింతగా హాట్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మరి..సీఎం జగన్ వీటిని ఎలా ఎదుర్కొంటారో.. స్థబ్దతగా ఉన్న పార్టీ ముఖ్యుల తీరు పైన ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  All opposition parties decided to target Jagan in all corners. CM Jagan says all are unite against him. At the same time Cm stated that he is ready for fight agaist them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more