విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వృషభ రాజుకు కన్నీటి వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ : సొంత కుటుంబ సభ్యులను పట్టించుకోని ఈ రోజుల్లో.. వృషభానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. గన్నవరంకు చెందిన రైతు కాసరనేని రాజా ఓ వృషభాన్ని పోషిస్తున్నారు. దానికి అల్లారుముద్దుగా పోతురెడ్డిపల్లి అనే నామకరణం చేశారు. అయితే ఈ వృషభ రాజు జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని 122 పతకాలు సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎద్దుల పోటీ జరిగినా ఈ వృషభ రాజు అక్కడ తలపడాల్సిందే. విజయం సాధించాల్సిందే. అలాంటి వృషభ రాజు కన్నుమూయడం.. తమకు దూరం కావడం.. రాజా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ వృషభ రాజు ఏపీ ఫేమస్

ఈ వృషభ రాజు ఏపీ ఫేమస్

ఈ వృషభ రాజు గురించి ఏపీలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎద్దుల పోటీ అంటే చాలు పోతురెడ్డిపల్లిగా పేరు పొందిన ఈ వృషభ రాజు గుర్తుకు రావాల్సిందే. అంతలా పేరు గాంచిన ఈ వృషభ రాజుపై వేలాది మంది అభిమానం చూపిస్తారు. అలాంటి వృషభ రాజు కన్నుమూసింది. దాంతో యజమాని కాసరనేని రాజా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. ఇన్నాళ్లుగా తాము దానితో పెంచుకున్న అనుబంధం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని అనుకోలేదని వాపోతున్నారు.

అంతా విషాదమే.. 6 పాయింట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొండా ట్వీట్ల యుద్దం..!అంతా విషాదమే.. 6 పాయింట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొండా ట్వీట్ల యుద్దం..!

తొమ్మిది సంవత్సరాల అనుబంధం.. ఇలా అర్ధాంతరంగా..!

తొమ్మిది సంవత్సరాల అనుబంధం.. ఇలా అర్ధాంతరంగా..!

ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సంవత్సరాలుగా ఈ వృషభ రాజుతో ఆ కుటుంబ సభ్యులకు అనుబంధముంది. తమతో పాటు దాన్ని కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూశారే తప్ప ఏనాడు కూడా అది జంతువు అనే కోణంలో చూడలేదు. ఆ విధంగా మూగజీవైన ఈ వృషభ రాజుపై అమితమైన ప్రేమ కురిపించారు. ఎక్కడా ఎద్దుల పోటీలు జరిగినా దాన్ని బరిలోకి దించేవారు. అయితే ఏ పోటీల్లో పాల్గొన్నా.. విజయం సాధించడమే తప్ప ఓటమి ఎరుగని వృషభ రాజుగా పేరుగాంచింది.

ఘనంగా అంత్యక్రియలు.. జంతు ప్రేమికులు కూడా తోడయ్యారు

ఘనంగా అంత్యక్రియలు.. జంతు ప్రేమికులు కూడా తోడయ్యారు

అయితే అది ఆకస్మాత్తుగా కన్ను మూయడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తొమ్మిది సంవత్సరాలుగా దానితో పెంచుకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న జంతు ప్రేమికులతో కలిసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులకు ఏవిధంగా అంతిమ క్రియలు చేస్తారో అదే విధంగా ఈ వృషభ రాజుకు కన్నీటి వీడ్కోలు పలికారు. పుర వీధుల గుండా అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇటీవల దానికి నలతగా ఉందని వైద్యులను పిలిపించి చికిత్స అందించినప్పటికీ బతకలేదని.. వృషభ రాజుతో తమ అనుబంధం తెగిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

English summary
Taurus Funeral Held In Grandway at Gannavaram in Krishna District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X