విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే?: స్పాట్‌లో సోము వీర్రాజు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Recommended Video

#VijayawadaCOVID19CareCenter: కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంపై చంద్రబాబు, నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. గాయపడ్డ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నారా లోకేష్ అన్నారు.

TDP, Chandrababu, Jana Sena president Pawan Kalyan condolences Vijayawada Fire accident

స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ కేర్ సెంటర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తనను కలిచి వేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఇలా ప్రమాదం బారినపడటం విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఈ కోవిడ్ సెంటర్‌లో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?, ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలని అన్నారు.

స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సోము వీర్రాజు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఘటన చోటు చేసుకున్న కొద్దిసేపటికే సోము వీర్రాజు స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రికి చేరుకున్నారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, వాటి స్థితిగతులను సమీక్షించాలని అన్నారు.

English summary
Telugu Desam Party Chief Chandrababu and Jana Sena Party President Pawan Kalyan and TDP National General Secretary Nara Lokesh, AP BJP President Somu Veerraju condolences to deceased families in Vijayawada Swarna palace covid hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X