• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతిని ముంచేందుకే..వరదలు సృష్టించారు : ఇది ప్రభుత్వ వైపరీత్యమే : చంద్రబాబు ఫైర్..!!

|

ఏపీలో తాజాగా వచ్చిన ఇచ్చారు. కృష్ణా వరదలను ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తుగా చంద్రబాబు అభివర్ణించారు. తన ఇంటిని..అమరావతిని ముందచేందుకే ఈ వరదలు సృష్టించారని ఫైర్ అయ్యారు. కృష్ణా వరద వచ్చిన తీరు.. వరదలకు కారణాలను చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగానే కృష్ణా పరివాహక లంక గ్రామాలన్నింటినీ ముంచారని ఫైర్ అయ్యారు. దారు లక్షల క్యూసెక్కుల నీటిని మేనేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 7 వరకూ రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదని విమర్శించారు.

అమరావతిని ముంచేందుకే..

అమరావతిని ముంచేందుకే..

కృష్ణానది వరదలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను ఉంటున్న ఇంటిని ముంచడం కోసం.. కృష్ణా పరివాహక లంక గ్రామాలన్నింటినీ ముంచారని ఆరోపించారు. నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వచ్చిన వరదల్ని చాలా జాగ్రత్తగా నియంత్రించే అవకాశమున్నా ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయారని ఆరోపించారు. ఐదారు లక్షల క్యూసెక్కుల నీటిని మేనేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 7 వరకూ రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదని విమర్శించారు. అమరావతి మునిగిపోతుందని అధికార పార్టీ ప్రచారం చేయటం సరి కాదన్నారు. అమరావతి మునిగే అవకాశమే లేదని..ఎటువంటి పెట్టుబడి లేకుండానే రాజధానిని తీర్చి దిద్దుకొనే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రైతులు ఇచ్చిన భూములు లేకపోతే..రోడ్లకు కూడా స్థలాలు ప్రభుత్వమే కొనుగోల చేయాల్సి వచ్చేదని వివరించారు. అయితే, రాజధాని పైన ప్రభుత్వమే ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. దీని పైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది ప్రభుత్వ వైపరీత్యమే..

ఇది ప్రభుత్వ వైపరీత్యమే..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ రిజర్వాయర్ లో ఎంత నీటి మట్టం ఉందీ.. ఏ రకంగా విడుదల చేసిందీ వివరించారు. ప్రభుత్వ దగ్గర సైతం లెక్కలు ఉంటాయని.. అధికారులక అప్పగించినా సమర్ధవంతంగా వ్యవహరించేవారని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ లెక్కల వివరాలు పూర్తిగా ఉన్నాయని, ఆల్మట్టి నుంచి నారాయణ్‌పూర్‌కు నీరు రావాలంటే 12 గంటల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పారు. మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు కృష్ణానది 1400కి.మీ ప్రయాణిస్తుందని గుర్తు చేశారు. నీటి ప్రవాహం వివరాలన్నీ ప్రభుత్వం, అధికారుల దగ్గర ఉంటాయని, ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా నీరు వదిలేశారని అందుకే ప్రకాశం బ్యారేజీ దిగువ లంక గ్రామాలు వరదలో మునిగిపోయాయని వివరించారు. వరదలపై ఏనాడూ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని.. ఇది ప్రభుత్వ వైపరీత్యమే అని ఎద్దేవా చేశారు. నా ఇంటిని ముంచే కుట్రతో ప్రజలను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని నియంత్రించడానికి అవకాశం ఉన్నా అలా చేయలేదని, రాజధానిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా తాగ టానికి నీరు లేక భాదపడుతుందే మంత్రులు కిన్ లే నీరు అడిగారని ఎద్దేవా చేసారు.

ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేయలేదు..

ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేయలేదు..

మహారాష్ట్ర..కర్నాటక ముఖ్యమంత్రులు వరద నీటి నిర్వహణ పైన సమీక్షలు చేసారని..ఏపీ ముఖ్యమంత్రి మాత్రం కనీసం అధికారులతో కూడా సమీక్ష చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. మంత్రులు తన ఇంటి చుట్టూ తిరగటమే కానీ..వరదల పైన సమీక్ష చేయలేదని విమర్శించారు. రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానన్నారు. కృష్ణా, గుంటూరులోని 19 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించానన్నారు. వరద ప్రాంతాల్లో హృదయవిదారక పరిస్థితులు చూశానని చంద్రబాబు తెలిపారు. లంక గ్రామాల్లో 53వేల ఎకరాల పంటనష్టం వాటిల్లిందన్నారు. కృష్ణాకు ఇవి కొత్తగా వచ్చిన వరదలు కాదని.. నీటి ప్రవాహం వివరాలన్నీ ప్రభుత్వం, అధికారుల దగ్గర ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల సహా పలు రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు వరద రావాలంటే 12 గంటలు పడుతుందన్నారు. నారాయణపూర్‌ నుంచి జూరాల రావాలంటే 30 గంటలు పడుతుందని.. జూరాల నుంచి శ్రీశైలానికి వరద రావాలంటే 30 గంటలు పడుతుందన్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద రావాలంటే 12 గంటలు పడుతుందని.. సాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద రావాలంటే 24 గంటలు పడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

English summary
TDP chief Chandra Babu given power point presentation on recent flood in capital area. Babu says its purely govt failure in flood management. Babu stated that Amaravati is not flood effected area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X