• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ పాలన మూడేళ్లే : జమిలి ఎన్నికలు ఖాయం : చంద్రబాబు..బీజేపీ నేత సంచలనం...!!

|

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జగన్ పాలన మూడేళ్లే ఉంటుందని జోస్యం చెప్పారు. రివర్స్ పాలనతో ప్రజలు రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని..అది సాధ్యం కాదని చెబుతూనే..జమిలి ఎన్నికలు మాత్రం ఖాయమని చెప్పుకొచ్చారు. మూడేళ్లలో జగన్ పాలన పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రం గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేసింది. దీని పైన వైసీపీ అధినేత సైతం మద్దతు ప్రకటించారు. దీని పైన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి..జమిలి ఎన్నికల ఆలోచన గురించి వివరించారు. ఈ వారం రోజుల్లో చంద్రబాబు రెండో సారి జమిలి ఎన్నికల పైన వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం జమిలి ఎన్నికలు ఖాయమని గట్టిగా చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు వీరిద్దరి వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. జమిలి ఎన్నికలు జరిగితే 2022లోనే ఏపీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జగన్ ప్రభుత్వం మూడేళ్లే ఉంటుంది...
ఏపీలో జగన్ ప్రభుత్వం అన్నింటా రివర్స నిర్ణయాలు తీసుకుంటోందని..ప్రజలు సైతం రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండనే అభిప్రాయంతో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రివర్స్ ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని..అయితే రివర్స్ ఎన్నికలు సాధ్యం కావు కానీ..జమిలి ఎన్నికలు తప్పవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ పాలన ఉండేది మూడేళ్లే నంటూ జోస్యం చెప్పారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు పార్టీలో ఆత్మ స్థైర్యం నింపేందుకు చేసారా..లేక నిజంగా కేంద్రం నుండి ఏమైనా సంకేతాలు వచ్చాయా అనే చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం జమిలి ఎన్నికల గురించి మాట్లాడారు.

జమిలి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల అధినేతలతో జమిలి ఎన్నికల నిర్వహణ పైన సమావేశం నిర్వహించింది. అందులో దాదాపు అందరు మద్దతు ప్రకటించారు. అది అమలైతే 2022 లోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దీంతో.. మరో మూడేళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉందని చెప్పటం ద్వారా పార్టీ నేతలను అప్పుడే ఎన్నికలకు సమాయత్తం చేయటం కోసమే చంద్రబాబు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పటం కోసం..ప్రతిపక్ష పార్టీ గా నిరసలకు సిద్దం అవుతోంది.

ప్రభుత్వాన్ని వదిలిపెట్టం..చంద్రబాబు వార్నింగ్ : పోటీగా వైసీపీ ఛలో ఆత్మకూరు..టెన్షన్..!!ప్రభుత్వాన్ని వదిలిపెట్టం..చంద్రబాబు వార్నింగ్ : పోటీగా వైసీపీ ఛలో ఆత్మకూరు..టెన్షన్..!!

TDP chief Chandra Babu says YCP govt will be in powr for only three years

మూడేళ్లలో ఎన్నికలు వస్తే...
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే సీట్లు.. 22 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇక, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణ పైన కేంద్రం అడుగులను జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇక..ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన పోరాటం చేస్తూ ప్రతిపక్ష పార్టీ టీడీపీ తిరిగి ప్రజల్లో నిలబడాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రాజధాని అమరావతి.. పోలవరం పనుల నిలుపదల..పీపీఏల సమీక్ష వంటి అంశాల మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఇక, ఇప్పుడు టీడీపీ కార్యకర్తల మీద దాడులను చూపుతూ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్దం అయింది.

అనేక మంది నేతలు పార్టీ వీడి వెళ్తున్న సమయంలో వారిని వారించటానికి.. భవిష్యత్ మీద భరోసా కల్పించటానికి చంద్రబాబు అగ్రెసివ్ రాజకీయాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రతీ అంశం మీద ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపటంతో పాటుగా పోరాటాలకు సిద్దం అవుతున్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని.. మరో మూడేళ్లు మాత్రమే వైసీపీ అధికారంలో ఉంటుందనే ప్రచారం ద్వారా పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు సైతం అదే వాదన తెర మీదకు తీసుకురావటం ద్వారా ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే మరో సారి రాజకీయం వేడెక్కుతోంది.

English summary
TDP chief Chandra Babu says YCP govt will be in powr for only three years. Central Govt may go for one nation one election in 2022. At the same time BJP MP C.M Ramesh also repeated same as Chandra Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X