విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ కు కీల‌క బాధ్య‌త‌లు: చ‌ంద్రబాబు పై ఒత్తిడి..పార్టీలో వ్య‌తిరేక‌త‌: ఇదే కీల‌క స‌మ‌యమంటూ..!

|
Google Oneindia TeluguNews

చంద్ర‌బాబు స‌మ‌కాలీన నేత‌లు వైయ‌స్ కుమారుడు జ‌గ‌న్ ఇప్పుడు సీఎం అయ్యారు. చంద్ర‌బాబు కంటే జూనియ‌ర్ కేసీఆర్ త‌న‌యుడు టీఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మ‌రి..లోకేశ్ కు అవ‌కాశం ఇవ్వాలి. ఇదీ కొంత కాలంగా చంద్రబాబు ఆలోచ‌న‌. అదే స‌మ‌యంలో లోకేశ్ ప్రాధాన్య‌త పెరిగేలా నిర్ణ‌యం తీసుకోవాలంటూ స‌న్నిహితుల నుండి చంద్ర‌బాబు పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో లోకేశ్ తీరు పైన పార్టీలోనూ అసంతృప్తి క‌నిపిస్తోంది. మ‌రి ఏం చేయాలి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్రబాబు వ‌య‌సు 74కు చేరుతుంది. మ‌రి లోకేశ్ భ‌విష్య‌త్ ఏంటీ.. టీడీపీని ముందుండి న‌డిపించేదెవ‌రు...ఈ ఆలోచ‌న‌ల న‌డుమ చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. స‌రైన స‌మ‌యంలో దీనిని ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

 లోకేశ్‌కు కీల‌క ప‌ద‌వి ఇచ్చే యోచ‌న‌...

లోకేశ్‌కు కీల‌క ప‌ద‌వి ఇచ్చే యోచ‌న‌...

టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. ఆయ‌న త‌న‌యుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నా..ఎమ్మెల్సీ ప‌ద‌వికే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓడిన త‌రు వాత పార్టీలో యువ‌ర‌క్తం పెంచాల‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా లోకేశ్ ను స‌మ‌ర్ధ‌వంతంగా తీర్చి దిద్దాల‌ని భావిస్తున్నారు. ఇందు కోసం లోకేశ్ కు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని అధినేత ఆలోచ‌న‌గా తెలుస్తోంది. చంద్ర‌బాబు స‌న్నిహితులు సైతం అదే సూచిస్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యం లోనే అనేక ఆటు పోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని..దీని ద్వారా స‌హ‌జంగానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెరుగుతాయ‌ని చెబుతున్నారు. మంత్రిగా ప‌ని చేసినా లోకేశ్ కు రాజ‌కీయంగా పూర్తి స్థాయిలో నైపుణ్య‌త రాలేదు. దీంతో..ఇప్పుడు ప్ర‌తి ప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు అసెంబ్లీలో పాత్ర‌కే ప‌రిమిత‌మై..బ‌య‌ట మాత్రం ఆ పాత్ర‌ను పూర్తిగా లోకేశ్ ద్వారా నిర్వ‌హించే ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో పాటుగా పార్టీలోనూ కీల‌క ప‌ద‌వి ఇచ్చే ఆలోచ‌న చేస్తున్నారు.

 పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వితో..

పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వితో..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను పార్టీ అధినేత‌గా ఉంటూ కుమారుడు కేటీఆర్‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేసి రాజ‌కీయంగా బాట వేసారు. ఇప్ప‌టికే కేటీఆర్ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని నిరూపించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్ష నేత‌గా రాటు తేలి ప్ర‌జ‌ల‌తో మమేకం అయి జ‌గ‌న్ సీఎం అయ్యారు. చంద్ర‌బాబు సైతం త‌న రాజ‌కీయ పోరాటంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలను చూసారు. ఇక‌, చంద్రబాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనే లోకేశ్ కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇచ్చే ప్ర‌తిపాద‌న పైన సీరియ‌స్‌గా చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అటు ప్ర‌భుత్వం..ఇటు పార్టీకి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేక పోయారు. ఇక‌, ఇప్పుడు పూర్తిగా పార్టీ వ్య‌వ‌హారాల మీదే దృష్టి పెడుతూ..త‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో లోకేశ్‌ను నెంబ‌ర్ టూ పొజీష‌న్‌లో రాజ‌కీయంగా తీర్చి దిద్దాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. కుటంబ స‌భ్యులతో విదేశీ టూర్‌కు వెళ్లిన స‌మ‌యంలో దీని పైన చ‌ర్చ సాగిన‌ట్లు చెబుతున్నారు.

చంద్ర‌బాబు ఆశ‌..పార్టీ నేత‌ల నిరాశ‌

చంద్ర‌బాబు ఆశ‌..పార్టీ నేత‌ల నిరాశ‌

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ‌య‌సు 69 సంవ‌త్స‌రాలు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటిని ఆయ‌న వ‌య‌సు 74కు చేరుతుంది. దీంతో.. పార్టీ బాధ్య‌త‌లు ఇప్ప‌టి నుండే లోకేశ్ కు అప్ప‌గించ‌టం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా సిద్ద మ‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. అందులో భాగంగా విదేశీ ప‌ర్య‌ట‌న నుండి వ‌చ్చిన నాటి నుండి లోకేశ్ అధికార పార్టీ మీద‌..ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ మీద ప్ర‌తీ రోజు ట్విట్ట‌ర్ ద్వారా పూర్తి లెక్క‌లు..స‌మాచారం తో స‌హా కార్న‌ర్ చేస్తున్నారు. అయితే, సొంత పార్టీలోనే లోకేశ్ కు ఇస్తున్న ప్రాధాన్య‌త పైన అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. గ‌తంలో మంత్రిగా ఉండి ..పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అంద‌రినీ ఒకే రకంగా కాకుండా..దూరం పెట్టార‌నే భావ‌న కొంద‌రిలో ఉంది. వారి తో ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్క‌రించుకొని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా లోకేశ్ కు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రి..దీనికి ముహూర్తం త్వ‌రలోనే ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది.

English summary
TDP chief Chandra Babu thinking to bring Lokesh in key post in party. Cahndra babu may shortly give responsibility as party working president for Lokesh. But party leaders not interest in this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X