విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భోగి వేడుకల్లో చంద్రబాబు: వైఎస్ జగన్ నిర్ణయాల వల్ల సంక్రాంతి చిన్నబోయింది: ఆ జీవోల దగ్ధం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పరిటాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన భోగీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. విజయవాడకు చెందిన పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సహా పలువురు పార్టీ నాయకులు, తెలుగు మహిళ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగీ మంటల్లో పడేసి, దగ్ధం చేశారు. ఆ జీవోల పట్ల నిరసన వ్యక్తం చేశారు.

 సంక్రాంతి పండక్కి జగన్ షెడ్యూల్ ఇదే: ఎక్కడికెళ్తున్నారంటే?: ఆ ఆనవాయితీకి చంద్రబాబు పుల్‌స్టాప్ సంక్రాంతి పండక్కి జగన్ షెడ్యూల్ ఇదే: ఎక్కడికెళ్తున్నారంటే?: ఆ ఆనవాయితీకి చంద్రబాబు పుల్‌స్టాప్

మున్సిపల్ జీవోలు..

మున్సిపల్ జీవోలు..


మున్సిపల్ చట్టాల్లో సవరణను తీసుకుని రావడానికి ఉద్దేశించిన 196, 197,198 జీవోలు అవి. వాటిని రద్దు చేయాంటూ కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోల వల్ల మున్సిపాలిటీల పరిధిలో నివసించే వారిపై పెనుభారం పడుతుందనేది టీడీపీ నేతల వాదన. పాత విధానం ప్రకారం.. అద్దె విలువ ఆధారంగా పన్ను వేసేవారని.. తాజాగా తీసుకొచ్చిన జీవోల వల్ల ఆస్తి విలువతో పాటు ఇంటి నిర్మాణానికైన ఖర్చును కలిపి పన్ను వేయడం వల్ల ప్రజలపై పెను భారం పడుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భోగీ మంటల్లో దగ్ధం..

భోగీ మంటల్లో దగ్ధం..

ప్రతి సంవత్సరం భూముల విలువతో పాటు పన్ను విలువ కూడా పెరుగుతూ ఉంటుందని, మంచినీటి పన్ను మొత్తాన్ని 350 రూపాయల వరకూ వసూలు చేయడం, మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు సామాన్యులపై పెను భారంగా పరిణమిస్తాయని విమర్శిస్తున్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను తెలియజేశారు. తాజాగా- అవే జీవోలను భోగి మంటల్లో వేసి.. నిరసన తెలిపారు.

ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన రైతాంగం..

ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన రైతాంగం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల ఈ సారి సంక్రాంతి పండుగ చిన్నబోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత సంక్రాంతికి ప్రజారాజధాని అమరావతిని కాదని, పాలకులు మూడు రాజధానుల మాట అందుకున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఆందోళనతో పండుగ చేసుకోలేక పోయారని విమర్శించారు. వరుస వరదలు, తుఫానులు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయారని, వారిని సకాలంలో ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని, ఫలితంగా ఈ సంక్రాంతి కూడా చిన్నపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మసక బారిన సంక్రాంతి..

మసక బారిన సంక్రాంతి..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వచ్చిన రెండు సంక్రాంతి పండుగలు రైతాంగ విధ్వంసానికి అద్దం పట్టాయని విమర్శించారు. పాలకులకు ప్రజలు బాగుండాలనే బలమైన ఆకాంక్ష, చిత్తశుద్ధి లేనందువల్లే ఇలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యం ప్రభుత్వానికి లేదని, అందుకే రైతుల పండుగగా భావించే సంక్రాంతి కాంతులు మసకబారాయని అన్నారు. ఈ ఏడాది రైతులకు కలిసి రావాలని, భోగభాగ్యాలతో రైతు లోగిళ్ళు కళకళలాడాలని కోరుకుంటున్నానని చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Telugu Desam Party Chief Chandrababu Naidu participates in Bhogi festival at Paritala in Krishna district. The former CM, along with the people present there, also set fire to the government orders issued by the state govt over farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X