విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ న‌ష్టం చేసారు: చ‌ంద్ర‌బాబు వివ‌క్ష చూపారు: టీడీపీ కాపు నేత‌ల దారెటు..బీజేపీనా..వైసీపీనా..!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీకి కష్ట కాలం. రాజ్య‌స‌భ స‌భ్యులు న‌లుగురు బీజేపీలో చేరారు. అదే స‌మ‌యంలో కాపు వ‌ర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ర‌హ‌స్య స‌మావేశం క‌ల‌క‌లం సృష్టించింది. టీడీపీ వీడేందుకే వీరు పార్టీకి స‌మాచారం లేకుండా స‌మావేశ‌మ‌వ‌టం కొత్త అనుమానాల‌కు దారి తీసింది. ఓట‌మి స‌మీక్ష కోస‌మే అని పాల్గొన్న నేత‌లు చెబుతున్నా..అందులో ప్ర‌ధానంగా నేత‌లంతా లోకేశ్ ల‌క్ష్యంగా ఆరోప‌ణ‌లు చేసారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం వివ‌క్ష చూపుతున్నారనే అభిప్రాయానికి వ‌చ్చారు. బీజేపీ..వైసీపీ ఈ రెండు పార్టీల్లో ఏది ఉత్త‌మం అనే చ‌ర్చ నేత‌ల వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌ల్లో చోటు చేసుకుంది. ఇంత‌కీ..అస‌లు స‌మావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు..

వ్యాపారాలు కావాలి..రాజకీయాలూ కావాలి..! విలువలతో మాకేంటి పని అంటున్న టీడిపి ఎంపీలు..!! వ్యాపారాలు కావాలి..రాజకీయాలూ కావాలి..! విలువలతో మాకేంటి పని అంటున్న టీడిపి ఎంపీలు..!!

కాపు నేత‌ల అస‌హ‌నం..
ఏపీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజయం త‌రువాత టీడీపీ నేత‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు లోలోప‌ల ఉన్న అసంతృప్తులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కాపు వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్య‌లో కాకినాడ‌లో ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ కి సైతం స‌మాచారం లేకుండా వీరు స‌మావేశం అవ్వ‌టంతో అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే కాపు నేత‌ల్లో ఉన్న అస‌హ‌నం..స‌మ‌స్య‌లు చ‌ర్చించి..రాజ‌కీయంగా నిర్ణ‌యం తీసుకోవ‌టానికే ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. తాజా ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌ను ప్ర‌ధానంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన నేత‌ల‌ను టీడీపీ నిర్ల‌క్ష్యం చేసింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. కాపులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే ఉంటార‌నే ఆలోచ‌న‌తో పార్టీలో అంకిత భావంతో ప‌ని చేసినా గుర్తింపు ఇవ్వ‌లేద‌ని కొంద‌రు నేత‌లు వాపోయిన‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో పార్టీలో జ‌రిగిన ప‌రిణామాల పైనా వారు చ‌ర్చించారు.

TDP Ex MLAs belongs to Kapu community secret meeting discussed problem which facing in party.

లోకేశ్ తో న‌ష్టం..బాబు వివ‌క్ష చూపారు..
ఇక‌, ఈ స‌మావేశంలో కొంద‌రు నేత‌లు త‌మ‌కు పార్టీలో ఎదురైన అనుభ‌వాల‌ను ప్ర‌స్తావించారు. త‌మ‌క‌ను ప‌ట్టించుకోని
లోకేశ్‌ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో..
ఎన్నికల సమయంలో నిధులు కూడా క‌మ్మ‌ సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చారని కొంద‌రు నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్‌ ఎక్కువ సమయం కేటాయించే వారని నేత‌లు అస‌హ‌నంతో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్‌ ఎక్కువగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం అయింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గురించి స‌మావేశంలో చ‌ర్చించారు. ఆయ‌న సైతం ఎన్నిక‌ల వేళ కాపు నేత‌ల‌ను విస్మ‌రించార‌ని .. వివ‌క్ష చూపించేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. చంద్రబాబు సైతం సొంత వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇస్తున్న స‌మ‌యంలో పార్టీలో ఎలా ఉండ‌గ‌లుగుతామ‌నే చ‌ర్చ జ‌రిగినట్లు చెబుతున్నారు.

కాపు నేత‌ల దారెటు..
ఇదే స‌మావేశంలో టీడీపీలో ఇంకా కొన‌సాగ‌గ‌ల‌మా లేదా అనే చ‌ర్చ జ‌రిగింది. అయితే, కొంద‌రు నేత‌లు పార్టీ వీడుదా మా అనే ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికిప్పుడే నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కొంద‌రు నేత‌లు స‌ర్ది చెప్ప‌గా..టీడీపీలో కంటే వైసీపీలోనే కాపుల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం ఉంద‌ని మ‌రో కీల‌కు నేత వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో వైసీపీలోకా..బీజేపీలోకి అనే విష‌యం పైన విడివిడిగా కాకుండా.. స‌మిష్టి నిర్ణ‌యం తీసుకుందామ‌ని సూచించారు. సీనియ‌ర్ నేత‌లు మాత్రం ఇప్ప‌టికిప్పుడు ఆ నిర్ణ‌యం అవ‌స‌రం లేద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. చంద్ర‌బాబు పిలిచాన‌..అంద‌రూ క‌లిసే వెళ్లాల‌ని తీర్మానించారు. అదే విధంగా త్వ‌ర‌లో విశాఖ‌లో మ‌రో సారి స‌మావేశం అవ్వాల‌ని నిర్ణ‌యించారు.

English summary
TDP Ex MLA's belongs to Kapu community secret meeting discussed problem which facing in party. Some leaders expressed opinion that Chandra Babu and Lokesh neglecting Kapu leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X