• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ప్రజలు పన్నుల కోసం ఆస్తులు అమ్ముకోవాలా ? వైసీపీ సర్కార్ పై టీడీపీ ధ్వజం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తిపన్ను చట్టానికి సవరణ చేస్తూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులపై భారం అంటూ తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. భవన నిర్మాణ శైలి ఆధారంగా ఆస్తిపన్ను విలువ వర్గీకరించి ఆస్తిపన్ను నిర్ణయించే విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం అక్రమ కట్టడాలు 25 నుంచి 100 శాతం వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది . ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

స్థానిక ఎన్నికల విషయంలో ఆ పని చెయ్యండి .. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి లేఖ

పెంచిన ఇంటి పన్ను కట్టాలి అంటే ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిందే : బోండా ఉమా

పెంచిన ఇంటి పన్ను కట్టాలి అంటే ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిందే : బోండా ఉమా

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నులు పెంచారని పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెంచిన ఇంటి పన్ను కట్టాలి అంటే ప్రజల ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని విమర్శలు గుప్పించిన బోండా ఉమా ఇప్పటికే వైసీపీ పింఛను 50 రకాల టాక్స్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను, నీటిపన్ను పెంచాలనే ఆలోచన వైసీపీ నేతలు విరమించుకోవాలని పేర్కొన్నారు. మీ అసమర్థ పాలనకు ప్రజలు ఎందుకు బలి కావాలంటూ బోండా ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 రాష్ట్రంలో విపరీతంగా పన్నుల బాదుడు అన్యాయం

రాష్ట్రంలో విపరీతంగా పన్నుల బాదుడు అన్యాయం

ఇప్పటికే జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీలతో పాటు, రాష్ట్రంలోని టోల్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం, పెట్రోల్ పై సర్ చార్జీల పేరుతో వసూళ్లకు తెర తీశారని, ఇక ఇప్పుడు తాజాగా ప్రజలపై పన్నుల బాదుడుకు రంగం సిద్ధం చేయడం అన్యాయం అంటూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, ప్రస్తుతం కరోనాతో ఇబ్బందిపడిన ప్రజలకు కొత్త సమస్య తీసుకురావద్దని కోరుతున్నారు.

తాజా చట్ట సవరణతో ప్రభుత్వంపై మొదలైన విమర్శలు

తాజా చట్ట సవరణతో ప్రభుత్వంపై మొదలైన విమర్శలు

రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లో ఐదు మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలుపగా కొత్త నిబంధనలు గెజిట్లో నోటిఫై చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటివరకు ఏడాది అద్దె ప్రాతిపదికన ఆస్తిపన్ను లెక్కిస్తోంది . ఇకముందు రిజిస్ట్రేషన్ విలువ సవరించిన ప్రతిసారి ఆమేరకు ఆస్తిపన్ను పెరగనున్న ట్లుగా తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను పది శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమైనా సరే తద్వారా పన్నుల బాదుడుకు రంగం సిద్ధమైనట్లు గా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమర్శనాస్త్రాలను ఎక్కు పెడుతున్నాయి.

English summary
Politburo member Bonda Uma was outraged that taxes on the people were increased after Jagan came to power in the AP. Bonda Uma, who has been criticized for saying that raising the house tax now means selling off public property, said people were already struggling with the 50 types of taxes. Bonda uma said the idea of ​​raising property tax and water tax should be withdrawn. Bonda Uma questioned the government as to why people should be sacrificed for your incompetent rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X