విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ విజయమ్మ కోసం పంచెల బ్యాచ్.. వాల్తేరు కబ్జాకు సీఎం జగన్ కుట్ర.. బోండా ఉమ ఫైర్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూదందా కోసమే అక్కడ రాజధాని ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ చెప్పిన నిజాల్ని ప్రభుత్వం బయటికి రానివ్వలేదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మొదట్లో అమరావతికి అనుకూలమని చెప్పిన జగన్.. సడెన్ గా రాజధాని కమిటీలు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ తల్లి విజయమ్మ పేరును ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంతకం చేశారంతే..

సంతకం చేశారంతే..


కమిటీల రిపోర్టుల ఆధారంగానే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పందమని, తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో తయారైన రిపోర్టుపై జీఎన్ రావు సంతకం పెట్టారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. తాము 13 జిల్లాల్లో పర్యటించామని జీఎన్ రావు చెబుతున్న మాట పచ్చి అబద్ధమన్నారు. వైజాగ్ పై జీఎన్ రావు కమిటీలో పేర్కొన్న అంశాలు చూస్తే ఏ ఒక్కరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారని, ఉద్దేశపూర్వకంగా అమరావతిని చంపేయడానికే వైసీపీ కుట్రలు చేస్తిందని ఆరోపించారు.

ఉత్తరాంధ్రపై ప్రేమ బూటకం

ఉత్తరాంధ్రపై ప్రేమ బూటకం

సీఎం జగన్ తీరుతో ఇప్పటికే వైజాగ్ లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ భయపడి వెనక్కి వెళ్లిపోతున్నాయని, ఉత్తరాంధ్రపై వైసీపీ నేతలది బూటకపు ప్రేమ అని బోండా మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, విశాఖలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు. కేవలం భూదందా కోసమే వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని, వాల్తేరును కబ్జా చేసేందుకు సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

పంచెకట్టు బ్యాచ్..

పంచెకట్టు బ్యాచ్..

చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్న అమరావతిని సమూలంగా నాశనం చేయడంతోపాటు వైజాగ్ లో తాము కొన్న భూముల కోసమే వైసీపీ నేతలు రాజధానిని మార్చాలనుకుంటున్నారని బోండా ఆరోపించారు. వైసీపీ కుట్రలు, రౌడీ రాజకీయాలను వైజాగ్ వాసులు గతంలోనూ చూశారని, సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి 2014లో విశాఖపట్నం నుంచి పోటీచేసినప్పుడు.. రాయలసీమ నుంచి పంచెకట్టు బ్యాచ్‌ రంగంలోకి దిగి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిందని గుర్తుచేశారు.

ప్రభుత్వమా? ప్రైవేటు కంపెనీనా?

ప్రభుత్వమా? ప్రైవేటు కంపెనీనా?

భారతి సిమెంట్స్ లాంటి ప్రైవేటు కంపెనీలు ఇష్టమొచ్చిన చోట బ్రాంచ్ లు పెట్టుకున్నట్లు.. జగన్ సర్కారు కూడా రాజధానుల్ని ఇష్టానికి ఏర్పాటుచేస్తామనడం హాస్యాస్పదమని టీడీపీ నేత అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు లేవని, జిల్లాకో హెచ్ వోడీ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే అభివృద్ధి దానంతట అదే జరిగిపోతుందని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.

English summary
TDP leader Bonda Umamaheswara Rao questioned why the chief minister Jaganmohan Reddy was in favor of Amaravati from the beginning and Why did the committees set up without asking anyone. He accused that gn rao committee report was premeditated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X