విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలో చిచ్చుపెట్టిన ప్రజావేదిక కూల్చివేత ... ఆందోళన తప్పు , బాబు భజన ఆపండి అన్న టీడీపీ నేత

|
Google Oneindia TeluguNews

ప్రజా వేదికపై టీడీపీ నేతల్లోనే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్ళలోనే బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఒక పక్క ప్రజా వేదిక కూల్చివేత జరుగుతుంటే మరో పక్క తెలుగుదేశం నేతలు తలా ఒక వాదన వినిపిస్తున్నారు . సీనియర్లు సైతం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు . మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాత్రం ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడాన్ని సరైంది కాదని తేల్చి పారేశారు.ఇటీవల తోట త్రిమూర్తులు వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్న వేళ టీడీపీలోనే ఉంటూ టీడీపీ నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఆయన తన అభిప్రాయం వెల్లడించారు.

రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత

బుధవారం నాడు తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. ప్రజా వేదికను కూల్చివేయడంపై స్పందించిన త్రిమూర్తులు చంద్రబాబు మెప్పు కోసం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన చేస్తున్నారని మండిపాటుకు గురయ్యారు . ఇక ఇప్పటికైనా టీడీపీ నేతలు చంద్రబాబుకు భజన చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలు మారకపోతే ప్రజలు క్షమించరని త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు.ప్రజా వేదిక కూల్చివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు .

TDP leader said protest is wrong , stop praising babu .. prajavedika demolision issue

ఇటీవల కాకినాడ వేదికగా టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో రహస్య భేటీకి కీలక భూమిక పోషించారు తోట త్రిమూర్తులు . ఈ సమావేశానికి వెళ్లకూడదని చంద్రబాబు వారించినా కూడ సుమారు 14 మంది నేతలు మీటింగ్‌లో పాల్గొన్నారు.కాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చొరవతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన కాపు నాయకులు 13 నుంచి 15 మంది దాకా హాజరయ్యారు. భేటీ రహస్యంగానే మొదలైనా... కాసేపటికే కాపు నాయకులు సమావేశమయ్యారన్న వార్త గుప్పుమంది. బీజేపీలో చేరే వ్యూహంలో భాగంగా వీరంతా భేటీ అయ్యారని జోరుగానే ప్రచారం జరిగింది.

English summary
Thota . Thrimurthulu was spoken to the the media on Wednesday. Thota . Thrimurthulu who responded to the demolition of the praja vedika were furious . He fired on MLC buddha. venkanna's protest against praja vedika demolition . He further advised that TDP leaders do protest it will be bad indication to the public . people never excuse the TDP eaders if they didn't change he stated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X