విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నియోజకవర్గం మారడానికి అంగీకరించని వంగవీటి రాధా.. ఏకంగా జిల్లానే వీడబోతున్నారా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు, కాపు సామాజిక వర్గ నాయకుడిగా పేరున్న వంగవీటి రాధాకృష్ణకు పార్టీ అగ్ర నాయకత్వం సరికొత్త బాధ్యతలను అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనను గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడంతో ఖాళీగా మారిన ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేయడానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

నియోజకవర్గాన్ని మారడానికి అంగీకరించలేదు..

నియోజకవర్గాన్ని మారడానికి అంగీకరించలేదు..

నిజానికి- వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు కొనసాగిన విషయం తెలిసిందే. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకొన్నారు. ఆయన పార్టీ ఫిరాయించడానికి ఉన్న ఏకైక కారణం.. నియోజకవర్గం మార్పు. వైఎస్ఆర్సీపీలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఆయనకు మచిలీపట్నం లోక్‌సభ బాధ్యతలను అప్పగించారు.

 తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేక..

తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేక..

విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా పార్టీనే మారిపోయారు వంగవీటి రాధా. మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తే.. ఓడిపోతాననే భయంతో ఆయన టీడీపీలో చేరారు. అక్కడ కూడా టికెట్ ఇస్తాననే హామీ లభించనప్పటికీ.. శాసనమండలికి పంపిస్తామనే ఏకైక హామీతో రాధా.. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారనే వాదనలు అప్పట్లో విస్తృతంగా వినిపించాయి. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో టీడీపీ ఆయన హామీని నెరవేర్చలేకపోయిందని అంటున్నారు.

ఈ సారి ఏకంగా జిల్లానే..

ఈ సారి ఏకంగా జిల్లానే..


నియోజకవర్గాన్ని మారడానికే అంగీకరించని వంగవీటి రాధా.. ఈ సారి జిల్లానే మారాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం పగ్గాలను రాధా చేతుల్లో పెట్టే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. సత్తెనపల్లి- కోడెల ఆత్మహత్యతో ఖాళీగా మారిన స్థానం. ఆ ఖాళీని వంగవీటి రాధాతో భర్తీ చేయవచ్చని, దీనికోసం సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు నుంచి ఇప్పటికే సందేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

కాపు సామాజిక ఓటు బ్యాంకుపై

కాపు సామాజిక ఓటు బ్యాంకుపై

సత్తెనపల్లిలో కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున సత్తెనపల్లి నుంచి విజయం సాధించిన అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. దీన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాను సత్తెనపల్లి బరిలో దింపడానికి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి వంగవీటి రాధా నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది తేలాల్సి ఉంది.

Recommended Video

Chandrababu Comments On Grama Sachivalayam Recruitment || నిరుద్యోగుల కన్నీళ్లకూ ఖరీదు కడతారా..?
 స్థానిక సంస్థల ఎన్నికల కోసం..

స్థానిక సంస్థల ఎన్నికల కోసం..


స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార వైఎస్ఆర్సీపీ సమాయాత్తమౌతోంది. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఖాళీగా ఉంచకూడదని, అలా చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికే చెందిన రాధాను అక్కడ దింపడం వల్ల ఆ వర్గం ఓటు బ్యాంకును చీల్చడమో లేక మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడమో సాధ్యపడుతుందని అంటున్నారు.

English summary
Telugu Desam Party leader Vangaveeti Radha Krishna is likely to appointed as incharge of Sattenapalli Assembly constituency in Guntur district. In the head of Local Body elections TDP President Chandrababu Naidu could taken this decision soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X