విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీకూ..నీ తుగ్లక్ ముఖ్యమంత్రికి లోకేష్ నామస్మరణేనా..దొంగ రాజైపోడు? టీడీపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం శృతి మించుతోంది. ప్రత్యేకించి- వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చేస్తోన్న విమర్శలపై తెలుగుదేశం నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఘాటు వ్యాఖ్యలతో బదులు ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల ట్వీట్ల యుద్ధం అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతోంది. ఆదివారం మరోసారి ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ఈ వివాదంలోకి లాగుతున్నారు టీడీపీ నాయకులు.

ప్రభుత్వ పనితీరు అద్భుతం: 12 లక్షలమందికి పైగా పరీక్షలు రాస్తే.. ఒక్క పొరపాటూ దొర్లలేదు!ప్రభుత్వ పనితీరు అద్భుతం: 12 లక్షలమందికి పైగా పరీక్షలు రాస్తే.. ఒక్క పొరపాటూ దొర్లలేదు!

లోకేష్ నామస్మరణే తప్ప మరో పని లేదా?

వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ను విమర్శించడమే పనిగా ఉందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయసాయి రెడ్డికి, తుగ్లక్ లా తయారైన ముఖ్యమంత్రి రోజూ లోకేష్ నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ ని చూసి తడుపుకొంటున్నారా? అని ఘాటు పదాలతో విమర్శించారు. నిద్ర లేచింది మొదలు లోకేష్ గురించే ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ గురించి ఆలోచించడం ఆపి పరిపాలనపై దృష్టిపెట్టండని సూచించారుు. అధికారమనే కిరీటం పెట్టగానే దొంగ రాజైపొడు విసారెడ్డి అని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లను సంధించారు.

TDP leadera and MLC Buddha Venkanna targets once again to Vijayasai Reddy in the row of Public Health

పరిపాలన అంటే పులివెందుల పంచాయతీ కాదు..

పరిపాలనలో ప్రో యాక్టివ్ స్టెప్స్ అనేవి తీసుకోవాలనే విషయాన్ని తుగ్లక్ ముఖ్యమంత్రికి వివరించాలని బుద్ధా వెంకన్న హితవు పలికారు. వర్షాకాలం వస్తోందంటే ముందు డ్రైనేజిలు క్లీన్ చేయించాలని అన్నారు. పారిశుధ్యం నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, దోమలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని తుగ్లక్ సీఎంకు వివరించాలని ఆయన సాయిరెడ్డికి సూచించారు. వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. అవేమీ పట్టించుకోకుండా ఉంటే ప్రజల పరిస్థితి గాలిలో దీపంలా మారుతుందని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ పరమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇదేమీ పులివెందుల పంచాయితీ కాదని చెప్పారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి, పరిపాలన కొనసాగించాలనే నిర్ణయాలను మార్చుకోవాలని అన్నారు.

English summary
Telugu Desam Party leader and MLC Buddha Venkanna once again targets YSRCP Senior leader and Rajya Sabha member V Vijayasai Reddy. Buddha Venkanna criticized with strong words to Vijayasai Reddy that, Chief Minister YS Jagan became a Tughlaq and taken wrong steps in Public health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X