విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసులకు లొంగిపోయిన దద్దమ్మలు .. బాబు లేని సమయంలో ఇలా .. ఆ ఎంపీలపై టీడీపీ నేతల ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు టీడీపీ రాజ్య సభ ఎంపీలు జంప్ అయ్యారు. బీజేపీకి జై కొట్టారు . దీంతో యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాక్ ఇచ్చారు . ఇక పార్టీ మారిన టీడీపీ రాజ్యసభ సభ్యులపై టీడీపీ నేతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసమే టీడీపీని వీడి వెళ్ళటం హేయమైన చర్యని , పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చెయ్యటం న్యాయం కాదని ఫిరాయింపు నేతలపై మండిపడుతున్నారు.

సంచ‌ల‌నం: టీడీపీలో చీలిక‌: న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల గుడ్ బై: ఛైర్మ‌న్‌కు లేఖ‌..! సంచ‌ల‌నం: టీడీపీలో చీలిక‌: న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల గుడ్ బై: ఛైర్మ‌న్‌కు లేఖ‌..!

కేసులకు భయపడి పిరికిపందల్లా పారిపోతారా అని ప్రశ్నించిన దేవినేని ఉమా

కేసులకు భయపడి పిరికిపందల్లా పారిపోతారా అని ప్రశ్నించిన దేవినేని ఉమా

మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంతకాలం చంద్రబాబుకు అండగా ఉండి ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను కాపాడాల్సిన స్థితిలో టీడీపీని వీడటం సరికాదని పేర్కొన్నారు. 1984 ఆగస్టు సంక్షోభంలో లక్షలాది మంది కార్యకర్తలు పోరాటం చేసి ఎన్టీఆర్‌ని మరోసారి ముఖ్యమంత్రిని చేశామని ఆయన గుర్తుచేశారు.1989లో ఘోర పరాజయం పాలైనా 1994లో మరోసారి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఇక నేతలు ఎందరు పార్టీ వీడినా టీడీపీ మాత్రం ఇలాంటి సంక్షోభాల్ని ఎన్నో ఎదుర్కొంది అని పేర్కొన్నారు. ఎంతోమంది నేతలు, అవకాశవాదులు, తమ స్వార్ధం కోసం పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారని ఉమా గుర్తు చేశారు. గ్రామ, మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీడీపీ కోసం గట్టిగా పని చేసి మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారన్నారు దేవినేని ఉమా. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులకు భయపడి పిరికిపందల్లా పార్టీ మీద బురదజల్లి పారిపోతున్నారని ఫిరాయింపు నేతలను ఎద్దేవా చేశారు ఉమా .

మీ రక్తంలో నిజాయితీ లేదా అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న

మీ రక్తంలో నిజాయితీ లేదా అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న టీడీపీని వీడిన ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుండెల్లో ధైర్యం, రక్తంలో నిజాయితీ లేని దద్దమమ్మలు అంటూ బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థం కోసం, వ్యాపార లావాదేవీల కోసమే వారు బీజేపీలో చేరారని బుద్దా వెంకన్న ఆరోపించారు.సుజనా, రమేశ్, గరికపాటికి చంద్రబాబు పదవులు ఇచ్చారని ఎన్నికల్లో గెలవలేకపోయినా పదవులు ఇచ్చి గౌరవించారని వెంకన్న గుర్తు చేశారు.ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలోకి మారతారా .. మీ రక్తంలో నిజాయితీ అనేది లేదా అని బుద్దా ఫైర్ అయ్యారు.
ఇక ఈ నాయకులే త్వరలో విజయసాయిరెడ్డి దగ్గరకు వెళతారని బుద్దా మండిపడ్డారు.ఉన్న పార్టీని గెలిపించుకునే సత్తా వీళ్లకు లేదని పేర్కొన్న బుద్దా రేపు బీజేపీ ఓడిపోతే ఏ పార్టీలోకి వెళతారని ప్రశ్నించారు . కేసులు మాఫీ చేసుకునేందుకే బీజేపీలోకి వెళ్లారని బుద్దా అభిప్రాయపడ్డారు .బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకే కాషాయ కండువాలు కప్పుకున్నారని, పార్టీ మారిన నేతలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని బుద్ధా హెచ్చరించారు. ఇక ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసేవారిని ఏపీలో తిరగనివ్వకూడదని.. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని బుద్ధా పేర్కొన్నారు.

చంద్రబాబు లేని సమయంలో ఇలా చెయ్యటం సరి కాదన్న గల్లా జయదేవ్

చంద్రబాబు లేని సమయంలో ఇలా చెయ్యటం సరి కాదన్న గల్లా జయదేవ్

చంద్రబాబు లేని సమయంలో ఇలా చేయడం సరికాదని ఎంపీ జయదేవ్ అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ ఎన్నికల్లో టీడీపీ 40 శాతం ఓట్లు పొందిందన్నారు. ఈ సంక్షోభాన్ని గట్టిగా ఎదుర్కొంటామని జయదేవ్ స్పష్టం చేశారు.టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై న్యాయసలహా తీసుకుంటామన్నారు . టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనైన నా అనుమతి, పార్టీ అధినేతకు సమాచారం లేకుండా జరిగిన ఈ విలీనం చెల్లదన్నారు జయదేవ్. మొత్తానికి నలుగురు టీడీపీ ఎంపీలు టీడీపీని వీడి బీజేపీలో చేరటంతో టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అవకాశవాదులుగా వారిపై మాటల దాడికి దిగారు. చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. మరోపక్క పార్టీలోని ముఖ్య నేతలను సైతం బీజేపీలో చేర్చుకునే వ్యూహంలో ముందుకు పోతున్నారు రాం మాధవ్ .

English summary
Four TDP Rajya Sabha MPs from Telugu Desam Party jumped. joined in BJP. This gave Chandrababu a shock when he was in Europe tour. TDP leaders are angry at the party-turned-TDP Rajya Sabha members. Defected leaders are ignoring the fact that going to the BJP for purely selfish purposes is a damning act and it is not fair to do so when the party is in a difficult situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X