విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీ తీరుపై తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం .. పోతే పో .. నోరు జాగ్రత్త అంటూ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై, లోకేష్ పై, అలాగే టీడీపీ ముఖ్య నాయకుల పై చేస్తున్న వ్యాఖ్యలు, మాటల్లో చెప్పనలవి కాకుండా వాడుతున్న పదజాలం తెలుగుదేశం పార్టీ నేతలను, శ్రేణులను షాక్ కు గురి చేస్తున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు వల్లభనేని వంశీ కి వార్నింగ్ ఇస్తున్నారు.

పప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీపప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీ

వంశీకి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీనే అన్న టీడీపీ నేతలు

వంశీకి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీనే అన్న టీడీపీ నేతలు

పార్టీని వీడి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపో... అంతేగానీ టిడిపి అధినేత చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో అంటూ హితవు చెబుతున్నారు. ఎక్కడో ఉన్న వంశీని తీసుకొచ్చి టికెట్‌ ఇచ్చింది టీడీపీనే అని గుర్తు చేస్తున్నారు. ఆ సీటు ఎందుకు? ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే వంశీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం వివేకం కాదని ఫైర్ అవుతున్నారు.

Recommended Video

Vallabhaneni Vamsi Mohan Fires Chandrababu Naidu About AP Sand Scarcity Issue
జగన్ షాడోలా వంశీ ప్రవర్తిస్తున్నారని మండిపాటు

జగన్ షాడోలా వంశీ ప్రవర్తిస్తున్నారని మండిపాటు

నిన్న మొన్నటిదాకా టిడిపిలో కొనసాగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ అంటున్నారు. జగన్ షాడోలా బిహేవ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. విజయవాడలోని టీపీపీ కార్యాలయంలో ‘వంశీ... నాడు - నేడు' లఘు వీడియోలను తెలుగుదేశం పార్టీ నేతలు ప్రదర్శించి మరీ వంశీని ప్రశ్నిస్తున్నారు. నాడు అన్నం తినేవాడు ఎవడు వైసీపీలో చేరడన్న వంశి వీడియోను ప్లే చేసి చూపిస్తున్నారు.

అన్నం తినేవాడు ఎవడూ జగన్ పార్టీలో చేరరన్న నాటి వంశీ మాటలపై ప్రశ్న

అన్నం తినేవాడు ఎవడూ జగన్ పార్టీలో చేరరన్న నాటి వంశీ మాటలపై ప్రశ్న

నాడు అలా మాట్లాడిన వంశీ నేడు వైసీపీలో చేరతానని చెప్పడంతో వంశీ అన్నం తినట్లేదా అంటూ ప్రశ్నించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ సందర్భంగా అన్నం తినేవాడు ఎవరూ వైసీపీలో చేరడు అన్న వంశీ ఇప్పుడు జగన్‌ పంచన ఎందుకు చేరాడు. ప్రలోభాలకు లొంగి ఆయన పార్టీ మారుతున్నాడు అని వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు జగన్‌ కనీసం వార్డు మెంబరుగా పనికిరాడన్న వంశీ ఆయన నాయకత్వంలో పనిచేస్తాననడం సిగ్గుచేటు అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

అయ్యప్పస్వామి మాలలో ఉండి వంశీ బూతులు తిట్టారన్న టీడీపీ నేతలు

అయ్యప్పస్వామి మాలలో ఉండి వంశీ బూతులు తిట్టారన్న టీడీపీ నేతలు


తనపై కేసులు నమోదు చేశారని చంద్రబాబుకు వివరించడానికి వచ్చినప్పుడు తాను వంశీ ను కలిసిన వర్ల రామయ్య ఆ సెక్షన్లన్నీ చూసి అవన్నీ టుమ్రీ కేసులని అప్పుడే చెప్పానన్నారు. టీసీనియర్‌ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను అయ్యప్పస్వామి మాలలో ఉండి వంశీ బూతులు తిట్టారని, అలా నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. మాలలో ఉన్న వ్యక్తులు ఇలాగే మాట్లాడతారా? అని వర్ల రామయ్య మండిపడ్డారు.

ఇంతకాలం పార్టీలో ఉండిఇప్పుడు బురద చల్లటం కరెక్ట్ కాదన్న టీడీపీ నేతలు

ఇంతకాలం పార్టీలో ఉండిఇప్పుడు బురద చల్లటం కరెక్ట్ కాదన్న టీడీపీ నేతలు

ఇంత కాలం టిడిపిలో కొనసాగి, ఇప్పుడు తీరా టిడిపి నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీపై బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అహంకారంతో రాజేంద్రప్రసాద్‌ను వంశీ దుర్భాషలాడటం సరికాదని టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మండిపడ్డారు.వల్లభనేని వంశీ ఈ విధంగా ప్రవర్తిస్తారు అనుకోలేదని ఆయన కేవలం జగన్ మెప్పు కోసమే ఈ విధంగా టిడిపిని కించపరిచి వెళ్తున్నాడని పేర్కొన్నారు.

లోకేష్ కు సోషల్ మీడియాలో ప్రచారానికి ఏం సంబంధం.. నిరూపించాలన్న టీడీపీ

లోకేష్ కు సోషల్ మీడియాలో ప్రచారానికి ఏం సంబంధం.. నిరూపించాలన్న టీడీపీ

ఇక వంశీ తన వ్యక్తిత్వాని కించపరిచేలా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు రాస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని, ఆ వెబ్‌సైట్లన్నీ లోకేశ్‌ సన్నిహితులవని ఆరోపించడం అర్థరహితమని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఆ వెబ్‌సైట్లకు, లోకేశ్‌కు ఉన్న సంబంధం నిరూపించాలన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపి బాట పట్టిన వల్లభనేని వంశీ చంద్రబాబు గురించి చేస్తున్న వ్యాఖ్యలు, నారా లోకేష్ ను ఉద్దేశించి చేస్తున్న విమర్శలు టిడిపి నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వ్యామోహం, పదవులపై ప్రేమ రాజకీయాల్లో ఎంతటివారినైనా నీచానికి దిగజారుస్తాయి అంటూ వంశీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
TDP leaders expressed their strong resentment against MLA Vallabhaneni Vamshi over his alleged harsh comments at party MLC Rajendra Prasad. In a 'Press Meet', Varla Ramaiah has faulted the attitude of MLA Vamshi targeting the party leaders and the high command. He has questioned MLA Vamshi for using objectionable language while in the devotion of Ayyappa sharanam. He has reminded MLA Vamshi's harsh comments at CM YS Jagan Mohan Reddy on earlier occasion and questioned him with satires for showing his interest to join his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X