విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే ఆఫర్- ఒప్పుకుంటే 24 గంటల్లో విజయవాడ శానిటైజేషన్..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా లాక్ డౌన్ సమయంలో రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రోజుకూ రకంగా సవాళ్లు విసురుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇవాళ మరో కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే టీడీపీ ఎమ్మెల్యే విసిరిన సవాల్ పై మాత్రం సర్వత్రా చర్చ జరుగుతోంది.

టీడీపీ ఎమ్మెల్యే ఆఫర్..

టీడీపీ ఎమ్మెల్యే ఆఫర్..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ జోన్లను ప్రకటించడంతో పాటు వాటిని పూర్తి స్ధాయిలో శానిటైజ్ చేయిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తోంది. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా చోట్ల పాల్గొంటున్నారు. దీన్నుంచి స్ఫూర్తి పొందారో ఏమో ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్... ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 ఒప్పుకుంటే 24 గంటల్లో...

ఒప్పుకుంటే 24 గంటల్లో...


ప్రభుత్వం ఒప్పుకుంటే 24 గంటల్లో విజయవాడ నగరం మొత్తం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు సమకూరిస్తే కేవలం ఒక్క రోజులోనే నగరమంతా ద్రావణం చల్లిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడగడం తోపాటు సోడియం హైపోక్లోరైడ్ వీధుల్లో చల్లితేనె కరోనా మహమ్మారి నుంచి బయటపడగలమని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు.

ఇప్పటికే తన నియోజకవర్గంలో...

ఇప్పటికే తన నియోజకవర్గంలో...

ప్రభుత్వం ఒప్పుకుంటే విజయవాడ నగరం మొత్తాన్ని 24 గంటల్లో శానిటైజ్ చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే... ఇప్పటికే తన సొంత నిధులు, సొంత వాహనాల్లో తన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ ద్రావణం ప్రాముఖ్యత తెలియడం వల్ల తాను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నట్లు గద్దే తెలిపారు. కాబట్టి ప్రభుత్వం తనకు సహకరించడం ద్వారా విజయనాడ నగరంలో కరోనా వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.

వైసీపీలో చర్చ- అనుమతిస్తారా ?

వైసీపీలో చర్చ- అనుమతిస్తారా ?

వాస్తవానికి విజయవాడ నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఓ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా కూడా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రభుత్వం అనుమతిస్తే విజయవాడను శానిటైజ్ చేసి చూపిస్తానని ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు అధికార పార్టీలోనూ చర్చకు దారి తీసింది. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు మాత్రం లేనట్లే..

English summary
in a wake of coronavirus spread in the city, tdp mla gadde rammohan offers his help to sanitize vijayawada city in 24 hours. mla gadde rammohan urges ap govt to give a chance to prove his capability. now this offers draws attention of the locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X