విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ముఖంపై ఉమ్మేయిస్తాం.. పదవులు వెంట్రుకతో సమానం.. సీఎంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా ఫైర్

|
Google Oneindia TeluguNews

శాసన మండలి రద్దు కాబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నది తుగ్లక్ నిర్ణయమే అయినా.. దాని ద్వారా తెలుగుదేశం ఎమ్మెల్సీలకు చరిత్రలో నిలిచిపోయే అవకాశం లభించిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.

మరో స్వాతంత్ర్య సమరం ఇది..

మరో స్వాతంత్ర్య సమరం ఇది..


బ్రిటిషర్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు జరిగిన స్వాతంత్ర్య పోరాటం లాంటిదే సేవ్ అమరావతి ఉద్యమమని బుద్ధా చెప్పారు. ‘‘చిన్నప్పటి నుంచి మనం స్వాతంత్ర్య సమరయోధుల గురించి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అలాగే ప్రజారాధాని అమరావతి కోసం మేం చేస్తున్న పోరాటాన్ని కూడా రాబోయే వంద తరాలు గొప్పగా చెప్పుకుంటాయి. ఫలానారోజు మండలి రద్దుకు వ్యతిరేకంగా బుద్ధా వెంకన్న పోరాడాడు అని నా మునిమనవళ్లు చెప్పుకుంటారు. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతోంది'' అని వెల్లడించారు.

బాబుదే శాసనం..

బాబుదే శాసనం..


ప్రజా రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారని, దానిపై ప్రజల తరఫున పోరాటం చేయాల్సిందిగా చంద్రబాబు తమను శాసించారని, ఆ మేరే టీడీపీ ఎమ్మెల్సీలు కీలకంగా వ్యవహరిస్తున్నారని వెంకన్న తెలిపారు. టీడీపీ పోరాటం చూశాక ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే సీఎం జగన్ మండలిని రద్దు చేస్తున్నారని విమర్శించారు.

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu
జగన్‌ను దేశమంతా అసహ్యించుకునేలా..

జగన్‌ను దేశమంతా అసహ్యించుకునేలా..

‘‘ఎమ్మెల్సీ పదవి నాకు వెంట్రుకతో సమానం. ప్రజల కోసం పదవి పోగొట్టుకోవడంలో ఉన్న ఆనందం అంతాఇంతా కాదు. మండలి రద్దుపై టీడీపీ న్యాయపోరాటం కూడా చేయబోవడంలేదు. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహం, రెట్టింపు బలంతో వైసీపీపై పోరాడి, వాళ్లను గద్దెదించుతాం. ఏ ప్రజలైతే 151 సీట్లిచ్చారో.. అదే ప్రజల చేత జగన్ ముఖంపై తుపుక్కున ఉమ్మేయిస్తాం.. దేశ ప్రజలంతా జగన్ ను అసహ్యించుకునేలా చేస్తాం'' అని బుద్ధా వెంకన్న తెలిపారు.

English summary
TDP MLAs Buddha Venkanna said that he was very happy with the abolition of the Legislative Council. he said Even if the chief minister's decision is worst, TDP got a chance to make history
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X