విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ధర్మానకు మతి చలించింది.. బాబుతో పోటీనా... టీడీపీ సీనియర్ నేతల రివర్స్ పంచ్

|
Google Oneindia TeluguNews

ఉత్తరాంధ్ర లో తనపై పోటీ చేయాలని చంద్రబాబు కు సవాల్ చేసిన ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేతలు ధర్మాన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు . నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు , బుద్దా వెంకన్న , చినరాజప్ప మంత్రి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు .

వడ్డీతో సహా చెల్లిస్తాం : బుద్దా వెంకన్న ఆగ్రహం

వడ్డీతో సహా చెల్లిస్తాం : బుద్దా వెంకన్న ఆగ్రహం

ధర్మాన కృష్ణదాస్ మతి చలించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే ధర్మాన కృష్ణప్రసాద్ చంద్రబాబును తిట్టి, జగన్ వద్ద ప్రాపకం సంపాదించాలని ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి నోటికొచ్చినట్లుగా బూతులు మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. మితిమీరి మాట్లాడేవారికి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేశారు బుద్దా వెంకన్న.

నీ స్థాయి చంద్రబాబును విమర్శించే స్థాయా : బుద్దా వెంకన్న

నీ స్థాయి చంద్రబాబును విమర్శించే స్థాయా : బుద్దా వెంకన్న

వైసిపి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న కారణంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి గోడను కూల్చారని , అవినీతి పునాదులపై కట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటినే ముందు కూల్చాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పదేపదే దేవుడున్నాడని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డికి, రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టిడిపిలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మాత్రమే మిగులుతుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ధర్మాన కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని పేర్కొన్నారు. కేవలం కేసులు మాఫీ చేయించుకోవడం కోసమే విజయ సాయి రెడ్డి ఎంపీ అయ్యారని విమర్శించారు బుద్ధ వెంకన్న.

మంత్రి బూతులు మాట్లాడటం సంస్కారహీనం : చినరాజప్ప

మంత్రి బూతులు మాట్లాడటం సంస్కారహీనం : చినరాజప్ప

టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ బూతులు మాట్లాడటం సంస్కారహీనమని టిడిపి సీనియర్ నేత , మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. ఒక డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఫైర్ అయిన చినరాజప్ప వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని పేర్కొన్న చినరాజప్ప రాజధాని అమరావతి రైతుల పోరాటం పై, పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఉద్యమాలు నడుపుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలకు ధర్మాన కృష్ణదాస్ క్షమాపణ చెప్పాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. రాజధాని రైతులు 291 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే రైతుల ఆందోళనలను అవహేళన చెయ్యటం మంత్రిగా తగదన్నారు . ధర్మాన కృష్ణదాస్ స్థాయికి చంద్రబాబును విమర్శించే హక్కు లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణదాస్ నోరు అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది అంటూ హెచ్చరించారు.

Recommended Video

Dubbaka By Elections 2020 : TRS ప్రభుత్వం దుబ్బాక కు చేసిందేమి లేదు, TDP కే గెలిచే హక్కు ఉంది : TTDP
 విశాఖలో పార్లమెంట్లో ఉపఎన్నిక పెట్టి తేల్చుకుందాం .. ధర్మాన సిద్ధమా ? అయ్యన్నపాత్రుడు

విశాఖలో పార్లమెంట్లో ఉపఎన్నిక పెట్టి తేల్చుకుందాం .. ధర్మాన సిద్ధమా ? అయ్యన్నపాత్రుడు

మంత్రి ధర్నాన కృష్ణదాస్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న సవాల్ విసిరారు . రాజధాని అంశంపై విశాఖ పార్లమెంట్‌లో ఉపఎన్నిక పెట్టి తేల్చుకుందామా ? మంత్రి ధర్మాన సిద్ధమా అని ప్రశ్నించారు. అమరావతియే రాజధానా? విశాఖపట్టణమే రాజధానా అనే అంశంపై అసెంబ్లీ రద్దు చేయాలని చంద్రబాబు కోరితే.. సీఎం జగన్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు విశాఖ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి అక్కడ ఒక్క చోటే ఉపఎన్నికకు వెళ్దామన్నారు అయ్యన్నపాత్రుడు. ప్రజల ఉద్దేశమేంటో అప్పుడు తెలిసిపోతుందన్నారు. సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి కృష్ణదాస్ కు లేదన్నారు అయ్యన్న పాత్రుడు

English summary
TDP leaders are incensed at AP Deputy CM Dharmana Krishnadas for challenging Chandrababu to contest against him in Uttarandhra. TDP senior leaders were outraged by Dharmana's remarks. He was told to keep his mouth shut and speak in a polite manne. TDP senior leaders Ayyannapathrudu, Buddha Venkanna and Chinarajappa gave a reverse counter to the minister's remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X