విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్‌ లేఖపై టీడీపీ మౌనం- వ్యూహాత్మకమా ? తమ పాత్రపై భయమా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇస్తున్న తీర్పుల వెనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఉన్నారంటూ సీఎం జగన్‌ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డేకు రాసిన లేఖపై టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. సాధారణంగా కోర్టులకు వ్యతిరేకంగా జగన్‌తో పాటు అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే విరుచుకుపడుతున్న టీడీపీ.. సీజేకు జగన్ రాసిన లేఖపై మాత్రం నోరుమెదపడం లేదు. ఈ లేఖలో టీడీపీకి మేలు చేసే విధంగా జస్టిస్‌ రమణ నిర్ణయాలు ఉన్నాయంటూ జగన్‌ చేసిన ఆరోపణలే ఇందుకు కారణమా లేక ఈ వివాదంలో జగన్‌ ఎలాగో ఇరుక్కోవడం ఖాయం కాబట్టి తాము మౌనంగా ఉండటమే మేలని టీడీపీ భావిస్తోందా అన్న చర్చ సాగుతోంది.

జగన్‌ ఆరోపణలపై టీడీపీ మౌనం..

జగన్‌ ఆరోపణలపై టీడీపీ మౌనం..

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్ధిరపరచడానికి హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా తీర్పులు ఇస్తున్నారనే అర్దం వచ్చేలా సీఎం జగన్‌ ఛీఫ్‌ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారు. ఇదంతా అంతిమంగా టీడీపీకి మేలు చేసేలా ఉందని జగన్‌ తన లేఖలో ఆరోపించారు. వాస్తవానికి ఈ లేఖ, జగన్‌ ఫిర్యాదుపై టీడీపీ ఇప్పటికే కౌంటర్లు ఇవ్వాలి. కానీ పచ్చ తమ్ముళ్లు మాత్రం ఈ విషయంలో నోరెత్తేందుకు సాహసించడం లేదు. అధినేత చంద్రబాబుతో పాటు కీలక టీడీపీ నేతలెవరూ ఈ లేఖలో జగన్‌ పేర్కొన్న అంశాలే కాదు దానికి కౌంటర్లు ఇచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. అధిష్టానం నుంచి వచ్చిన సూచనలే ఇందుకు కారణమా అన్న చర్చ నడుస్తోంది.

టీడీపీ వ్యూహత్మక మౌనం...

టీడీపీ వ్యూహత్మక మౌనం...

సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సీఎం జగన్‌ ఛీఫ్‌ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన విషయంలో టీడీపీ మౌనం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది ఈ వ్యవహారం మరింత రచ్చకాకుండా చూడటమే అన్నట్లు కనిపిస్తోంది. సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్ రాసిన లేఖపై పార్టీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెడితే వైసీపీ నుంచి తిరిగి ఎన్‌కౌంటర్లు ఖాయం. అదే జరిగితే ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడం ఖాయం. సుప్రీంకోర్టుతో పాటు న్యాయవ్యవస్ధ ప్రతిష్ట దృష్ట్యా ఇది ఎవరికీ మంచిది కాదు. అంతిమంగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని దీనిపై చర్యలకు దిగితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ తాము ఈ వ్యవహారంపై మాట్లాడినా అంతిమంగా తమ పాత్రపై ఎక్కువగా చర్చ జరిగి వైసీపీకే లబ్ది చేకూరవచ్చనే భయం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా మౌనాన్నే ఆశ్రయించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.

Recommended Video

Ys Jagan కంప్లైంట్ To SC Chief Justice Bobde Against Andhra HC,SC Judge NV Ramana | Oneindia Telugu
ఎలాగో జగన్‌ ఇరుక్కోవడం ఖాయం...!

ఎలాగో జగన్‌ ఇరుక్కోవడం ఖాయం...!


సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులను సైతం టార్గెట్‌ చేస్తూ జగన్‌ ప్రారంభించిన ఈ పులిస్వారీ అంతిమంగా ఆయనకు నష్టం కలిగించడం ఖాయమని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ వ్యవహారంలో సీజేకు జగన్‌ లేఖ రాయడం వరకూ కొంత వరకూ సమర్ధనీయమే అయినా ఆ తర్వాత దాన్ని బహిర్గతం చేసి ప్రజల్లో్కి చర్చకు పెట్టడం ద్వారా జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని టీడీపీ నేతలు తమ అంతర్గత చర్చల్లో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వ్యవహారంలో తాము స్పందించినా, స్పందించకపోయినా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడం ఖాయమే. అలా కాదని ఓ దశ తర్వాత జగన్‌ వెనక్కి తగ్గాలనుకున్నా అది సాధ్యం కాకపోవచ్చని టీడీపీ అభిప్రాయపడుతోంది. అందుకే ఇప్పుడు వైసీపీ అధినేత ఈ వ్యవహారంలో ఇరుక్కోవడం ఖాయమని పసుపు పార్టీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
the main opposition party tdp in andhra pradesh maintains silence over chief minister ys jagan's recent complaint on supreme court judge justice nv ramana. tdp's silence raises doubts over their role in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X