విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టాభిపై దాడితో కొడాలి నానీ , వల్లభనేని వంశీ టార్గెట్.. జగన్ కు లేఖ , హత్యాయత్నం అంటూ టీడీపీ హంగామా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో పంచాయతీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది . టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటి వద్ద దాడి చేసిన క్రమంలో టిడిపి నేతలు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలంటే తీవ్ర పదజాలంతో విరుచుకుపడే నాని ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారు అన్న ఆసక్తి నెలకొంది .

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దుండగుల దాడి .. వైసీపీ కుట్ర అంటూనే గాయాలతో ఆస్పత్రికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దుండగుల దాడి .. వైసీపీ కుట్ర అంటూనే గాయాలతో ఆస్పత్రికి

 మంత్రులే చంపుతామని , ఇంటికొచ్చి కొడతామని బెదిరించడంతోనే ఇలా : నారా లోకేష్

మంత్రులే చంపుతామని , ఇంటికొచ్చి కొడతామని బెదిరించడంతోనే ఇలా : నారా లోకేష్

వైయస్ జగన్ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతున్న కారణంగానే పట్టాభి ని టార్గెట్ చేసి హత్యా యత్నం చేశారని తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు.
టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్న నారా లోకేష్ మంత్రులే చంపుతామని , ఇంటికొచ్చి కొడతామని బెదిరించడం పై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని పేర్కొన్నారు జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కి వైసీపీ మంత్రులు వార్నింగ్ ఇచ్చి మరీ గుండాలతో దాడి చేయించి ఎంతగా బరితెగించారో అర్థమవుతుంది అంటూ కొడాలి నాని ని టార్గెట్ చేశారు.

 జగన్ కు కొడాలి నానీ , వల్లభనేని వంశీలపై కేసులు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ

జగన్ కు కొడాలి నానీ , వల్లభనేని వంశీలపై కేసులు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ

ఇక ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీతో సహా ఇతర పక్షాలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని అశోక్ బాబు ఆ లేఖ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు . అంతేకాదు, తెలుగుదేశం నేతల ఇంటికొచ్చి బడిత పూజ చేస్తామని చెప్పిన మంత్రి కొడాలి నాని అతనికి వత్తాసు పలికిన వల్లభనేని వంశీ ల ప్రోద్బలంతోనే పట్టాభిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు .

 కొడాలి నానీ స్కెచ్ ఇదంతా అన్న బోడె ప్రసాద్

కొడాలి నానీ స్కెచ్ ఇదంతా అన్న బోడె ప్రసాద్


కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై 307 కింద కేసు నమోదు చేయాలని ఆయన తన లేఖ ద్వారా సీఎం జగన్ కు డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ నేత పట్టాభి పై జరిగిన దాడిని ఖండించిన మరో టిడిపి నేత బోడె ప్రసాద్ పది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యే ఇంట్లో కొడాలి నాని, కొక్కిలిగడ్డ జాన్, పండు మరో పది మంది తో మీటింగ్ పెట్టి పట్టాభి పై దాడి చేయాలని అనుకున్నారని , అందులో ఉన్న ఒక వ్యక్తి తనకు ఈ విషయంపై సమాచారాన్ని అందించారని మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగిందని బోడె ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పట్టాభిపై దాడికి కొడాలి నానీకి లింక్ .. మంత్రి స్పందన ఏంటో ?

పట్టాభిపై దాడికి కొడాలి నానీకి లింక్ .. మంత్రి స్పందన ఏంటో ?


కొడాలి నాని బడిత పూజ చేస్తాము అని చెప్పిన వ్యాఖ్యలను, నిన్న పట్టాభి పై జరిగిన దాడి తో లింక్ చేస్తూ కొడాలి నాని, నాని వ్యాఖ్యలకు మద్దతు పలికిన వల్లభనేని వంశీ ని టార్గెట్ చేసి టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో టిడిపి నేత పట్టాభి పై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు నోరు విప్పని మంత్రి కొడాలి నాని, ఈ వ్యవహారం పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
In the state of Andhra Pradesh, the politics of panchayat elections are going on . Panchayat election politics is heating up with attacks, allegations, counter-allegations. TDP criticized and targeted minister Kodali Nani and MLA Vallabhaneni Vamsi after unidentified persons attacked TDP national spokesperson Pattabhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X