విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తేల్చేసిన లగడపాటి: ఏపీలో టీడీపీదే అధికారం.. తెలంగాణలో కారు హావా.. కాని.. అంటూ ట్విస్ట్..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రా ఆక్టోప‌స్ ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల పైన త‌న అంచ‌నాల‌ను చెప్పేసారు. ఏపీలో తిరిగి సైకిల్ కోరుకుంటున్నార ని తేల్చారు. తెలంగాణ ప్ర‌జ‌లు అక్క‌డ మిగులు బ‌డ్జెట్ కాబ‌ట్టి కారు కోరుకున్నారు..ఇక్క‌డ లోటు బ‌డ్జెట్ కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌లు సైకిల్ వైపే మొగ్గు చూపారని విశ్లేషించారు. మూడు పార్టీల‌కే ఏపీ ప్ర‌జ‌లు 95 శాతం ఓట్లు వేసారని వివ‌రించారు . ఆదివారం సాయంత్రం పూర్తి విశ్లేష‌ణ చేస్తాన‌ని వెల్ల‌డించారు. అయితే, చివ‌ర‌కు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇది త‌న అంచ‌నా అంటూ..స‌ర్వే వివ‌రాలు రేపు చెబుతానంటూ స‌మాధానం ఇచ్చారు. స్ప‌ష్ట‌మైన మెజార్టీతోనే ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందని తేల్చి చెప్పారు.

ఏపీలో సైకిల్‌కే ప‌ట్టం క‌ట్టారు...

ఏపీలో సైకిల్‌కే ప‌ట్టం క‌ట్టారు...

ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ జోస్యం చెప్పారు. ఆదివారం చివ‌రి విడ‌త పోలింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌టంతో..పూర్తి వివ‌రాలు ఆదివారం సాయంత్రం వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 23వ తేదీ న వెల్ల‌డ‌య్యే ఫ‌లితాల‌కు అనుగుణంగా ప్ర‌జల నాడి తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేసాన‌ని స్ప‌ష్టం చేసారు. ఆర్‌జి ఫ్లాష్ టీం ద్వారా వేలాది మందిని శాంపిల్‌గా తీసుకొని స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఏపీలో రాజ‌ధాని పాండ‌వుల ఇంద్ర‌ప్రస్థానంగా నిర్మాణం సాగుతుంద‌ని విశ్లేషించారు. ఏపీలో సంక్షేమం..అభివృదంది కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. రాజ‌ధాని నిర్మాణం సైతం ఆశ‌ల‌కు త‌గిన‌ట్లుగానే పూర్త‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని నిర్మాణం వ‌స్తుంద‌ని విశ్లేషించారు.

స‌ర్వే ఫ‌లితం కాదు..అంచ‌నా మాత్ర‌మే..

స‌ర్వే ఫ‌లితం కాదు..అంచ‌నా మాత్ర‌మే..

తాను ఇప్పుడు చెబుతున్న‌ది స‌ర్వే ఫ‌లితం కాద‌ని..అంచ‌నా మాత్ర‌మేన‌ని ల‌గ‌డ‌పాటి ట్విస్ట్ ఇచ్చారు. ఆర్జీ ఫ్లాష్ టీం స‌ర్వే వివ‌రాలు ప్ర‌క‌టిస్తాన‌ని వెల్ల‌డించారు. ఇవియంల్లో తొంగి చూసి చెప్ప‌టం లేద‌ని..కొంచెం తేడాలు ఉంటాయ‌ని వివ‌రించారు. ఏపీలో మొత్తం 95 శాతం వ‌ర‌కు పోలింగ్ మూడు పార్టీల‌కే వేసార‌ని చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ‌లో త‌న స‌ర్వే ఫెయిల్ అయింద‌ని..ప్ర‌తీ సారి నిజం అవ్వాల‌ని లేద‌ని..అదే స‌మ‌యంలో స‌ర్వేలు చేయ‌కుండా కూర్చోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చారు. తాము వంద శాతం క‌రెక్ట్‌గా చెప్ప‌లేమ‌ని..కొంత అటూ ఇటూగా ఉండే అవ‌కాశం ఉందని వివ‌రించారు. ఆదివారం పోలింగ్ ముగిసిన త‌రువాత తిరుప‌తి వేదిక‌గా ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో వివ‌రిస్తాన‌ని వెల్ల‌డించారు.

మెగాస్టార్ త‌మ్ముడిగా ఆయ‌న కంటే త‌క్కువ‌గా..

మెగాస్టార్ త‌మ్ముడిగా ఆయ‌న కంటే త‌క్కువ‌గా..

ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన పార్టీ అన్న‌య్య కంటే త‌క్కువ‌గా గెలుస్తార‌ని వివ‌రించారు. ప‌వ‌ర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోతున్నార‌ని చెప్పుకొచ్చారు. ఖ‌చ్చిత‌మైన మెజార్టీతోనే ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసారు. చ‌రిత్ర‌లో ఏపీలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ రాలేద‌ని..ఇప్పుడూ స్ప‌ష్టంగానే ఉంటుంద‌న్నారు. పార్టీల‌కు ఓటింగ్ శాతం త‌గ్గుంద‌ని తేల్చి చెప్పారు. తాను చంద్ర‌బాబుతో పాటుగా జ‌గ‌న్‌తోనూ స‌మావేశ‌మ‌య్యాన‌ని వివ‌రించారు. వివేకా హ‌త్య స‌మ‌యం లో పులివెందుల వెళ్లాన‌ని చెప్పారు. జ‌గ‌న్‌తో స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసాన‌ని చెప్పుకొచ్చారు.

English summary
ex MP Lagadapati Raja Gopal Reveal AP Election Results. He says Public once again given priority for Cycle in polling. He indirectly indicated that TDP will win in Elections. Total Survey results will be announced in Tirupaty on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X