విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకాభిప్రాయం కుదిరేనా: ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల కీల‌క స‌మావేశం: అయిదు ప్ర‌ధానా అంశాలే అజెండా..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాల ప‌రిష్కారానికి ఒక అరుదైన స‌మావేశం ఏర్పాటైంది. అయిదే ళ్ల కాలంలో ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లు..భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల పైన చ‌ర్చించేందుకు ఇద్ద‌రు తెలుగు ముఖ్య‌మంత్రు ల కీల‌క భేటీ రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ మ‌రి కాసేప‌ట్లో ఆరంభం కానుంది. ఇందులో ప్ర‌ధానంగా అయిదు అంశాలు..అందులో నదీ జ‌లాల వినియోగం ప్ర‌ధానగా చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ స‌మావేశం ద్వారా స‌మ‌స్య‌లు ఎంత వ‌ర‌కు ప‌రిష్కారం అవుతాయ‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌..

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు...రెండు రోజులు

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు...రెండు రోజులు

ఏపీ..తెలంగాణ మ‌ధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా రెండు రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భేటీ అవుతున్నారు. ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్చ‌లు చేస్తూనే ఉన్నారు. అయితే, పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప‌రిష్కారం కోసం రెండు రోజుల పాటు మార‌థాన్ మీటింగ్ ఏర్పాటు చేసారు. న‌దీ జ‌లాల వినియోగం..విద్యుత్తు సంస్థల విభజన, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా పలు కీలకాంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించి ఓ అంగీకారానికి వస్తే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ప‌డ‌తాయ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

న‌దీ జ‌లాల పైనే ఫోక‌స్..

న‌దీ జ‌లాల పైనే ఫోక‌స్..

రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవస‌రాలు..ల‌భ్య‌త‌..వినియోగం పైనే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఈ స‌మావేశంలో ప్ర‌ధాన అంశంగా చ‌ర్చించ‌నున్నారు. గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీజలాలపై వివాదాల పరిష్కారం దిశ‌గా నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం క‌నిపిస్తోంది. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై ప్రధానంగా చ‌ర్చించే అంశం పైన ఇప్ప‌టికే ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. ఇదే స‌మావేశంలో రెండు రాష్ట్రాల నీటి అవస రాలు.. పంపిణీపై కేసీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఉద్యోగుల మ‌ద్య వివాదాలు..ఉద్రిక్త‌త‌లు సృష్టించిన విద్యుత్‌ సంస్థల విభజన, ఉద్యోగుల సర్దుబాటు, విభజన సమయం నాటికి డిస్కంలకు బకాయిల చెల్లింపు ల అంశం పైనా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదే విధంగా..పౌరసరఫరాల సంస్థ విభజన, లెవీ నిధుల వినియోగ విషయం పైనా చ‌ర్చ‌..దీంతో పాటుగా దిల్లీలోని ఏపీ భవన్‌ వ్యవహారంలో పెండింగ్ అంశాల ప‌రిష్కారం.. ఇక‌,
తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన అంశాల పైనా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు దృష్టి సారించ‌నున్నారు.

ఏపీ ..తెలంగాణ మంత్రులు సైతం..

ఏపీ ..తెలంగాణ మంత్రులు సైతం..

ఇద్దరు ముఖ్య‌మంత్రుల స‌మావేశానికి తెలంగాణ నుంచి ఏడుగురు.. ఏపీ నుంచి ఐదుగురు మంత్రులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి.. ఎల్వీ సుబ్రహ్మణ్యం సైతం ఈ రెండు రోజుల సమావేశం లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు చ‌ర్చించే కీల‌క రంగాల అధికారుల సైతం అందుబాటులో ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. అందులో భాగంగా.. నీటిపారుదల..ఆర్థిక..విద్యుత్‌.. పౌరసరఫరాలు, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు ఈ స‌మావేశ స‌మ‌యంలో పాల్గొంటారు. వీరితోపాటు రెండు ప్రభుత్వాల సలహాదారులు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ సమావేశానికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను శ‌నివారం సాయంత్రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల సంయుక్త మీడియా సమావేశంలో వెల్ల‌డించ‌నున్నారు.

English summary
Both Telugu states Chief Ministers meeting two days on pending issues between AP and Telanagana. Mainly both CM's concentrated on river water distribution. Agenda fixed on five main issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X