విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!అనుచ‌రుల‌తో క‌లిసి వైసీపీలోకి..!కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్‌..

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ వీడనున్న దేవినేని అవినాశ్ || Devineni Avinash decided to Resign TDP And Join In YCP

టీడీపీకి భారీ షాక్‌. తెలుగుయువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ టీడీపీ వీడనున్నారు. ఆయ‌న పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించారు. అవినాశ్ తో పాటుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవినేని నెహ్రూ అనుచ‌రులు..అభిమాను లు టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అవినాశ్ నాయక‌త్వంలో వీరంతా వైసీపీలో చేర‌నున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి అండ‌గా ఉంటూ వ‌స్తున్న ప్ర‌ధాన సామాజిక వ‌ర్గానికి చెందిన అవినాశ్..త‌న తండ్రి మ‌ద్ద‌తు దారు ల‌తో క‌లిసి వైసీపీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టంతో జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్‌. అవినాశ్ తాజా ఎన్నిక‌ల్లో గుడివాడ నుండి కొడాలి నాని పైన పోటీ చేసి ఓడారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విదేశాల నుండి తిరిగి రాగానే అవినాశ్ వైసీపీలో చేర‌టం దాదాపు ఖాయ‌మైంది.

టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!

టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!

తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ టీడీపీ వీడాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు త‌న తండ్రి అనుచ రులతో చ‌ర్చించిన త‌రువాత ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు గా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న నెహ్రూ అనుచ‌రుల‌తో క‌లిసి అవినాశ్ వైసీపీలో చేరాల‌ని డిసైడ్ అయ్యారు. అధికారికం గా ప్ర‌క‌టించ‌ట‌మే మిగిలి ఉంది. త‌న తండ్రితో క‌లిసి అవినాశ్ టీడీపీలో చేరారు. ఆ త‌రువాత కొద్ది కాలానికే అవినాశ్ తండ్రి దేవినేని నెహ్రూ అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఆ త‌రువాత అనినాశ్‌కు తెలుగు యువ‌త ప‌ద‌వి ద‌క్కింది. తాజా గా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గుడివాడ నుండి అవినాశ్ పోటీ చేసారు. ఎలాగైనా కొడాలి నాని ఓడాలంటే అవినావ్ స‌రైన అభ్య‌ర్ది గా గుర్తించిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఎన్నిక‌ల్లో అవినాశ్ ఓడిపోయారు. దీంతో...కొద్ది రోజు లుగా అవినావ్ పార్టీ కార్య‌క‌ల‌పాల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇక టీడీపీ వీడాల‌ని అవినాశ్ నిర్ణ‌యించారు. దీని పైన నేడో రేపో అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

వైసీపీలోకి అవినావ్ ఎంట్రీ..!

వైసీపీలోకి అవినావ్ ఎంట్రీ..!

టీడీపీ వీడాల‌ని నిర్ణ‌యించిన అవినాశ్ ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌న్నిహితులు చెబుతు న్నారు. ఆయ‌న అనుచ‌రులతో క‌లిసి వైసీపీలో చేరుతార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము తొలి నుండి పోరాటం చేస్తున్న వంగ‌వీటి కుటుంబానికి చెందిన రాధాను టీడీపీలో చేర్చుకోవ‌టంతో అప్పటి నుండే దేవినేని అవినాశ్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే, రాధాకు చంద్ర‌బాబు ఇస్తున్న ప్రాధాన్య‌త పైన నెహ్రూ అనుచ‌రులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో..రాధా ఉన్న పార్టీలో తాము ఉండ‌కూడ‌ద‌ని అప్ప‌ట్లోనే భావించారు. అయితే, తొంద‌ర ప‌డి అడుగు వేస్తే రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌నే భావ‌న వ్య‌క్తం అయింది. దీంతో..ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూసారు. ఇదే స‌మ‌యంలో కృష్ణా జిల్లాలో మ‌రి కొంత మంది నేత‌లు సైతం టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణ‌యించారు. దీంతో అవినాశ్ తో సైతం సంప్ర‌దింపులు పూర్త‌య్యాయి. అవినాశ్ ఇక..టీడీపీ వీడ‌టం..వైసీపీలో చేర‌టం ఖాయ‌మ‌నే ప్ర‌చారం పార్టీలో జోరుగా సాగుతోంది.

వైయ‌స్‌కు ద‌గ్గ‌ర‌గా నెహ్రూ..నేడు త‌న‌యుడితో..

వైయ‌స్‌కు ద‌గ్గ‌ర‌గా నెహ్రూ..నేడు త‌న‌యుడితో..

తొలుత టీడీపీలో ఎన్టీఆర్‌కు విధేయుడిగా ఉన్న దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. వ‌రుస‌గా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఎపిసోడ్ త‌రువాత టీడీపీకి దూర‌మ‌య్యారు. ఆ త‌రువాత వైయ‌స్ సూచ‌న మేర‌కు కాంగ్రెస్‌లో చేరారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 2017లో ఆయ‌న త‌న కుమారుడు అవినాశ్ తో క‌లిసి టీడీపీలో చేరారు. 2017 ఏప్రిల్ 17న నెహ్రూ అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఆ త‌రువాత అవినాశ్ య‌క్టివ్‌గా ప‌ని చేసారు. ఇక‌, మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అవినాశ్ టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న వైసీపీలో చేర‌టం ఇక లాంఛ‌న‌మే.

English summary
Telugu yuvatha President Devineni Avinash decided to resign TDP and join in YCP. With his father followers Avinash may join in YCP shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X