• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజధాని రగడ: శాసన మండలిలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రుల బాహాబాహీ..

|

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు బాహాబాహికి దిగడంతో దాదాపు అరగంటపాటు వాతావరణం రణరంగంలా మారింది. మండలి చైర్మన్ పోడియం ముందే రెండు పక్షాలు వాదులాడుకున్నాయి. లోపల జరుగుతోన్న సీన్లు చూసి గ్యాలరీల్లో కూర్చొన్నవాళ్ల నేతలకు కూడా వణుకు పుట్టినంతపైనంది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ ముగిసిన తర్వాత వాటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష నేత యనమల పట్టుపట్టారు. బిల్లులో అన్నీ అభ్యంతరకర అంశాలున్నాయిని, వాటిపై మరింత అవగాహన అవసరమని, అందుకే సెలెక్ట్ కమిటీకి పాపాలని ఆయన చెప్పారు. యనమల ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదన్నారు. సంఖ్యాబలం ఉందికదాని బిల్లుల్ని అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. దీంతో రెండు వైపుల ఉన్న సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

లోకేశ్ వర్సెస్ బొత్స

లోకేశ్ వర్సెస్ బొత్స

బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనంటూ టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియం వైపు దూసుకెళ్లారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలు కూడా పోడియం ముందే నిలబడి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో మంత్రి కొడాలి నాని.. టీడీపీ ఎమ్మెల్సీలవైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ వాళ్లు కూడా అదే కోపంతో నానికి ఎదురొచ్చారు. మరోవైపు మంత్రి బొత్స, మాజీ మంత్రి నారా లోకేశ్ మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం చోటేసుుంది.

కట్టడిచేయడంతో..

కట్టడిచేయడంతో..

గ్యాలరీలో కూర్చొని సభలో జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తోన్న చంద్రబాబు, వైసీపీ ముఖ్యనేతలు ఆ సీన్లు చూసి పైకి లేచారు. మంత్రులు శ్రీరంగనాథ రాజు, మోపిదేవి వెంకట రమణలు వైసీపీ సభ్యుల్ని కట్టడిచేయగా.. టీడీపీ వైపు నుంచి టీడీ జనార్దన్ ఆ పని చేశారు. ఈ గందరగోళం నడుమ మండలి 15 నిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా తర్వాత ఉద్రిక్తత పూర్తిగా చల్లారింది.

టీడీపీతో సీఎం చర్చలు?

టీడీపీతో సీఎం చర్చలు?

రెండు బిల్లులు శాసన మండలిలో ఆమోదం పొందేలా మండలి చైర్మన్ తో సీఎం జగన్ మాట్లాడుతారని, తప్పనిసరిగా అవసరమనుకుంటే టీడీపీ ఎమ్మెల్సీలతోనూ చర్చించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ రాత్రి లోపే బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. టీడీపీ సభ్యులు దిగిరాకుంటే మండలి వ్యవస్థనే రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.

English summary
tension erupted in ap legislative council on wednesday as tdp opposed decentralisation bills. several ministers had word fight with tdp mlcs. TDP majority in AP upper House hurdle to ruling YSRCP three-capital plan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more